పుస్తకాలు చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి:- Ex NCERT Member, విద్యాభారతి ఉన్నత విభాగం జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ మురళి మనోహర్ గారు.
పది గ్రామాలలో GSF Sadhana Village Libraries ప్రారంభం.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాధన విలేజ్ లైబ్రరీ ల ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు వినోభానగర్ లోని సాధన కుటీర్ జరిగింది.
ఎంపిక చేసిన పది గ్రామాలకు గ్రంథాలయ సామాగ్రి @ బుక్ రాక్స్ 2 , చైర్ 1 ,టేబుల్ 1 మరియు కాంపిటీటివ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది.
MCKS FOOD for HUNGRY FOUNDATION సహకారంతో ఈ గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులకు మరియు బాలలకి ఉపయోగపడే విధంగా బాల సాహిత్యం ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి.
వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తకాలు కేవలం ఉద్యోగ సాధన కోసమే కాకుండా జీవితాన్ని సాధించడానికి చదవాలి, అదొక అద్భుత సాధనగా మన దినచర్యలో ఒక భాగంగా పుస్తక పఠనం చేయాలని ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యా భారతి ఉన్నత విభాగం జాతీయ ఉపాధ్యక్షులు, Ex NCERT Member శ్రీ మురళి మనోహర్ గారు పాల్గొన్న గ్రంథాలయ నిర్వహకులకు తెలిపారు.
GSF వ్యవస్థాపకుడు సదా వెంకట్ మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి ఈ గ్రంథాలయాల కోసం ఫౌండేషన్ విశేష ప్రయత్నం చేస్తుoది, ముఖ్యంగా బాల సాహిత్యంతో 2014- 15 సంవత్సరాలలో సంచార గ్రంథాలయం మరియు 5 గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటు కూడా జరిగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విడత 10 గ్రామాలలో ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న యువత కోసం మరియు బాల సాహిత్యంతో సాధన గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిందన్నారు.
ప్రతి గ్రామంలో సుమారు 20 నుండి 40 మంది వరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న గ్రామాలలో, 5 గురు నిర్వహణ సభ్యులుగా( Regulatory Committee) గుర్తించి, వారినే ఈ ప్రారంభోత్సవ కార్యానికి ఆహ్వానించారు.
ఈ గ్రంథాలయ ఏర్పాటుకు
ఒక్క గ్రామానికి సుమారు 75 వేల రూపాయల ఖర్చుతో సామాగ్రి అందజేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో గ్రంథాలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయం నిర్వహించబడుతుంది.
యాచారం, మంచాల, వీరపట్నం మరియు కoదుకూరు మందళాలలోని
మొండిగౌరెల్లి,కుర్మిద్ద,మంతన్ గౌరెల్లి,
గడ్డ మల్లయ్యగూడ, లోయపల్లి,ఆరుట్ల,మంచాల్,ఆకులమైలారం,బేగంపేట్ మరియు వినోభా నగర్ సాధన కుటీర్ గ్రామాల్లో ఈ సాధన లిలేజ్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రారంభోత్సవo అనంతరం గ్రంథాలయ నిర్వాహకులకు సామాగ్రీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్టోపస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు,MCKS FOOD for HUNGRY FOUNDATION ప్రతినిధి శాంతకుమారి,
సాధన లైబ్రరీ కోర్డినేటర్స్ డా.మహేందర్ ప్రొఫెసర్ వినయ్, శ్రీశైలం, పవన్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
:~ సదా వెంకట్,
జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
No comments:
Post a Comment