Sunday, March 20, 2022

Transforming the idea of farming to the future generations

 Transforming the idea of farming to the future generations





The GSF team of volunteers in sadhana kuteer had started organic farming of vegetables(*Tomato, Brinjal, Chillies, and cucumber) from the last three months. Meanwhile, they spent daily 2hours cleaning weed plants in the garden and sadhana kuteer premises. The main intention is to create a model of make farming for the students participating in Sadhana camps.

The volunteer's efforts paid off as we were cooking our vegetables.

Sunday, March 13, 2022

Sadhana Kuteer demolition-ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.

 పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సాధన కుటీర్


https://youtu.be/ACQx2mmZdxU

(pls Watch full Video's)


ఏదైనా కూల్చడం తేలికే- కూర్చడమేకష్టం.


అత్యాశతో ఆశను(గోడలను)మాత్రమే కూల్చగలరు- ఆశయాన్ని కూల్చడం బ్రహ్మ తరమూ కాదు...

ఆశయం అంతర్నిహితమైనది- అగ్ని సమానమైనది.

కొందరి అందకారాన్ని దహిస్తుంది- కొందరికి జ్ఞాన జ్యోతవుతుoది.


ఫిబ్రవరి  28వ తేదీ GSF_  సాధన కుటీర్ పై  జరిగిన కుట్రపై సమాదానాలకై..


స్వామి వివేకానంద, డా.బి.ఆర్.అంబేద్కర్ మరియు డా. అబ్దుల్ కలాoజీల ఆశయాలను కొనసాగించడం తప్పు పనా? అది అవసరమా?  లేదా అని సభ్య సమాజం ఆలోచన చేయాలి.


కొందరి  అనాలోచిత చర్యలవల్ల GSF సాధన కుటీర్ కు జరగకూడని కొంత నష్టం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్లగా GSF_సాధనకుటీర్ లో  పల్లె ఆణిముత్యాల 

సాధనశిబిరాలు జరగలేదు. ఈ సమయంలో పల్లె ఆణిముత్యాల శిబిరాలకోసం అవసరమైన ఏర్పాట్ల దృష్టితో #GSF_ #సాదనకుటీర్ ని తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. 

 అకారణంగా, దుర్మార్గంగా కొందరి మూర్కపు దుశ్చర్య వల్ల ఇంకో యాడాది శిబిరాలు ఆగితే నష్టం ఎవరికి అనేది సమాజం ఆలోచిoచాలానే ఉద్దేశ్యంతో.....

 గత 13 ఏండ్ల కాలంగా GSF ద్వారా పభుత్వ/బడుల్లో చదివే పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరిగిన పనిని జరిగినట్టుగా సమాజానికి చూపే ప్రయత్నం చేస్తున్నాం.


దీనిలో మంచి, చెడు అనేది సభ్యసమాజమే గుర్తించాలి.


*స్వామి వివేకానంద,

 డా.అంబేద్కర్ & డా. కలాంజీల కలల కోసం ఆశయ స్పూర్తితో, ఒక నిర్దిష్ట కార్యాచరణతో నిత్య చైతన్యంగా 

పల్లె ఆణిముత్యాల వికాసంకోసం జరుగుతున్న పని సమాజానికి అవసరమా లేదా అని సభ్య సమాజం నిర్ణయం చేయాలి, చేస్తుందని ఆశిస్తున్నాము*..


ఏదైనా కూల్చడం తేలికే - కూర్చడమే కష్టం.


visit @ www.gsf.org.in.

కూల్చింది గోడలే- చైతన్యాన్ని కాదు..

 



కూల్చబడ్డ పల్లె ఆణిముత్యాల  శౌచాలయాల గోడల్లోని ఇటుకలు నిండు చైతన్యంతో మరో స్ఫూర్తివంతమైన కార్యసాధనకోసం నిర్మిoచే గోడల్లోకి పోతున్నాయి....

కూల్చిన క్రమం అంతా జ్ఞాపకాలు ఇక్కడి గోడల్లో పదిలంగా దాస్తాము, మనదంటూ ఓ రోజు వచ్చాక ఆ జ్ఞాపకాలు  మల్లి అందిస్తాము అంటూ పోతున్నాయి.   ప్రతి  ఆదివారం  ఉదయం భారతమ్మకు హారతి కోసం పూసే పూల మొక్కలు ఇప్పుడు కూలిన ఆ గోడల కింద నలిగి, పైకి చూస్తుంటే వాటికి ఓదార్పుతో ఇటుకలు చెప్పిన స్ఫూర్తి మాటలవి...

కూల్చింది గోడలే- చైతన్యాన్ని కాదు..

Friday, March 11, 2022

Farming in Sadhana Kuteer

 





విత్తు మొక్కై, మొక్క చెట్టయి, పూత పూసి- కాయ కాసి, పండుగా మారి వండుకుని తినే పరిణామ క్రమమంతా విద్యార్థి దశలోనే అవగతం అయితే కలం పట్టిన వారిమధ్య-హలం పట్టిన మధ్య వ్యత్యాసం, ఆ శ్రమని గమనిస్తారు.

మార్చ్/ఏప్రిల్ లో పారంభమయ్యే సాధన శిబిరాలలో పాల్గొనే విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కలగాలని సాధన కుటీర్ లోని సాధకులు పండించిన కూరగాయల  మొదటికాత..  సాధకులే వండుకుని తింటున్నారు😀

Tuesday, March 8, 2022

SAADRI Team on womens Day

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో 

SAADRI_ Women Wing of GSF.




జ్ఞానసరస్వతి ఫౌండేషన్_GSF  2008 నుండి గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభావంతులైన, నిరుపేదలను గుర్తించి, వారికి అవసరమైన 12 SAC కార్యకలాపాలలో ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా వారిని విద్యా సంబంధ విషయాలలోనే కాక వారి సృజనాత్మక ను ప్రోత్సహించడం మరియు మంచి పౌరులుగా తయారు చేయడం కోసం పూర్వ రంగారెడ్డి జిల్లాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలంగాణ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో గ్రామీణ బాలికలకు ప్రోత్సాహం మరింత అవసరం. బాలికా విద్య యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, *GSF యొక్క మహిళా విభాగం SAADRI ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ఆత్మగౌరవ అవగాహన సెషన్‌ లను  SHE program ద్వారా నిర్వహిస్తుంది. GSF పూర్వ విద్యార్థులు సమర్పణ భావంతో అందించిన విరాళాలతో, సాధన కుటీర్‌లో భరత మాత యొక్క అందమైన విగ్రహం ఏర్పాటు చేయబడింది, ఇది ముందు తరాల పల్లె ఆణిముత్యాలకు  ప్రేరణను స్ఫూర్తినిస్తుంది. గత 52 వారాల నుండి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు GSF బృందం, సందర్శకులు/అతిథులతో కలిసి సాధన కుటీర్‌లోని భరత మాత విగ్రహానికి హారతి ఇవ్వడం ద్వారా త్యాగమూర్తులను స్మరించుకుంటారు . నిన్న మాలో  కొందరు సాద్రి సభ్యులం  భారత మాత హారతికి  వెళ్ళాము. 'సాధన కుటీర్' ప్రాంగణానికి చేరుకోగానే పరిస్థితి చూసి అందరి మనసు వేదనకు గురయ్యింది. కొంతమంది రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు కుటీర కార్యకలాపాలలో నిజానిజాలు తెలియక  పల్లె ఆణిముత్యాల ఆశల సౌరభం సాధనా కుటీరాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు కొన్ని వారాల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 250 నుండి 300 మంది పిల్లలు 10వ పబ్లిక్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్‌ని పొందుతున్నారు.  పల్లె ఆణిముత్యాల సాధనా క్యాంప్ లో దాదాపుగా 200 మంది శిక్షణ పొందుతారు.ఇప్పుడు కుటీర్ పునరుద్ధరించబడకపోతే  GSF యొక్క ప్రత్యేకంగా డిజైన్ చేసిన SAC కార్యక్రమాలు ఆలస్యం కావచ్చు ఫలితంగా  పల్లె ఆణిముత్యాలకు లభించే అవకాశాలు చేజర్చిన వాళ్ళం అవుతాం..నిరంతర సాధన లో ఉన్న వారి సృజనాత్మక నైపుణ్యాల శిక్షణ కి  కొంత break ఏర్పడుతుంది. సత్కార్యాలకు సత్ఫలితాలు వచ్చే క్రమంలో కొన్ని అవాంతరాలు తప్పడం లేదు. మేము మా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, గౌరవనీయులైన సదాజీని కలుసుకున్నాము మరియు పరిస్థితిని చర్చించాము. ఈనెల మార్చి 5 వ తేదీన GSF  SAADRI 3వ వార్షికోత్సవ వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా సాధనా కుటీర్ లో నిర్వహించాలని అనుకున్నాము..దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు, ఇబ్రహీంపట్నం పరిధిలోని ఇంటర్,డిగ్రీ కాలేజ్ విద్యార్థినులకు  ప్రత్యేకంగా కాంపిటీషన్స్ conduct చేయడం జరిగింది..దీనికి సంబంధించిన results కూడా వచ్చాయి.పిల్లలంతా results కోసం ఉత్సాహంగా అడుగుతున్నారు. కానీ 28 న జరిగిన సంఘటన వల్ల మహిళదినోత్సవ వేడుకలు postpone చేసుకున్నాము. ఈరోజు జూమ్ మాధ్యమంగా online లో BreakTheBias అంటూ SAADRI బృందం కార్యక్రమం చేస్తున్నారు. మరింత ఉత్సాహంగా SAC కార్యక్రమాలు నిర్వహించడానికి సామాజిక  బాధ్యతను నెరవేరుస్తూ పల్లె ఆణిముత్యాల ఉత్తమమైన సేవలు అందించడానికి  ఆ భరతమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మేము మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాము. *ఈ మహిళా దినోత్సవం రోజు ఈ దుశ్చర్య కు పాల్పడిన వారికి సద్బుద్ధిని ఇవ్వమని, త్వరలో సాధన కుటీర్‌  పునఃనిర్మాణం కోసం శక్తిని ఇవ్వమని ఆ సరస్వతిమాతను వేడుకుంటున్నాము.  భారత్ మాతా కీ జై 🙏.  

 :~team సాద్రి

Saturday, March 5, 2022

SCRPS visited sadhana kuteer

click here for video

జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ పై అక్రమ దాడి హేయమైన చర్య


- SCRPS రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్


ఇబ్రహీంపట్నం లో గల జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ ను SCRPS రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ అధ్వర్యంలో బృందం సందర్శించింది.

ప్రభుత్వ పాఠశాల లో ప్రతిభ కలిగిన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా శిక్షణా ఇస్తూ వారిని ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దుతున్న గొప్ప కేంద్రం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్.

అటువంటి కేంద్రం పై అక్కసుతో కొందరు స్థానిక  రాజకీయ నాయకులు కుట్రలు పన్ని ఆశ్రమం పై దాడి కి పాల్పడి ద్వంసం చేయడం మంచి పరిణామం కాదనీ, ఇందుకు బాధ్యులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు మారేడు మోహన్.

ఈ కార్యక్రమంలో SCRPS నగర అధ్యక్షులు రాంబాబు దొంతమల్ల,ఉపాధ్యక్షులు మంద సుధాకర్ మరియూ అరవింద్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

#support_scrps #save_sc_reservations