Tuesday, March 8, 2022

SAADRI Team on womens Day

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో 

SAADRI_ Women Wing of GSF.




జ్ఞానసరస్వతి ఫౌండేషన్_GSF  2008 నుండి గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభావంతులైన, నిరుపేదలను గుర్తించి, వారికి అవసరమైన 12 SAC కార్యకలాపాలలో ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా వారిని విద్యా సంబంధ విషయాలలోనే కాక వారి సృజనాత్మక ను ప్రోత్సహించడం మరియు మంచి పౌరులుగా తయారు చేయడం కోసం పూర్వ రంగారెడ్డి జిల్లాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలంగాణ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో గ్రామీణ బాలికలకు ప్రోత్సాహం మరింత అవసరం. బాలికా విద్య యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, *GSF యొక్క మహిళా విభాగం SAADRI ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ఆత్మగౌరవ అవగాహన సెషన్‌ లను  SHE program ద్వారా నిర్వహిస్తుంది. GSF పూర్వ విద్యార్థులు సమర్పణ భావంతో అందించిన విరాళాలతో, సాధన కుటీర్‌లో భరత మాత యొక్క అందమైన విగ్రహం ఏర్పాటు చేయబడింది, ఇది ముందు తరాల పల్లె ఆణిముత్యాలకు  ప్రేరణను స్ఫూర్తినిస్తుంది. గత 52 వారాల నుండి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు GSF బృందం, సందర్శకులు/అతిథులతో కలిసి సాధన కుటీర్‌లోని భరత మాత విగ్రహానికి హారతి ఇవ్వడం ద్వారా త్యాగమూర్తులను స్మరించుకుంటారు . నిన్న మాలో  కొందరు సాద్రి సభ్యులం  భారత మాత హారతికి  వెళ్ళాము. 'సాధన కుటీర్' ప్రాంగణానికి చేరుకోగానే పరిస్థితి చూసి అందరి మనసు వేదనకు గురయ్యింది. కొంతమంది రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు కుటీర కార్యకలాపాలలో నిజానిజాలు తెలియక  పల్లె ఆణిముత్యాల ఆశల సౌరభం సాధనా కుటీరాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు కొన్ని వారాల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 250 నుండి 300 మంది పిల్లలు 10వ పబ్లిక్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్‌ని పొందుతున్నారు.  పల్లె ఆణిముత్యాల సాధనా క్యాంప్ లో దాదాపుగా 200 మంది శిక్షణ పొందుతారు.ఇప్పుడు కుటీర్ పునరుద్ధరించబడకపోతే  GSF యొక్క ప్రత్యేకంగా డిజైన్ చేసిన SAC కార్యక్రమాలు ఆలస్యం కావచ్చు ఫలితంగా  పల్లె ఆణిముత్యాలకు లభించే అవకాశాలు చేజర్చిన వాళ్ళం అవుతాం..నిరంతర సాధన లో ఉన్న వారి సృజనాత్మక నైపుణ్యాల శిక్షణ కి  కొంత break ఏర్పడుతుంది. సత్కార్యాలకు సత్ఫలితాలు వచ్చే క్రమంలో కొన్ని అవాంతరాలు తప్పడం లేదు. మేము మా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, గౌరవనీయులైన సదాజీని కలుసుకున్నాము మరియు పరిస్థితిని చర్చించాము. ఈనెల మార్చి 5 వ తేదీన GSF  SAADRI 3వ వార్షికోత్సవ వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా సాధనా కుటీర్ లో నిర్వహించాలని అనుకున్నాము..దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు, ఇబ్రహీంపట్నం పరిధిలోని ఇంటర్,డిగ్రీ కాలేజ్ విద్యార్థినులకు  ప్రత్యేకంగా కాంపిటీషన్స్ conduct చేయడం జరిగింది..దీనికి సంబంధించిన results కూడా వచ్చాయి.పిల్లలంతా results కోసం ఉత్సాహంగా అడుగుతున్నారు. కానీ 28 న జరిగిన సంఘటన వల్ల మహిళదినోత్సవ వేడుకలు postpone చేసుకున్నాము. ఈరోజు జూమ్ మాధ్యమంగా online లో BreakTheBias అంటూ SAADRI బృందం కార్యక్రమం చేస్తున్నారు. మరింత ఉత్సాహంగా SAC కార్యక్రమాలు నిర్వహించడానికి సామాజిక  బాధ్యతను నెరవేరుస్తూ పల్లె ఆణిముత్యాల ఉత్తమమైన సేవలు అందించడానికి  ఆ భరతమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మేము మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాము. *ఈ మహిళా దినోత్సవం రోజు ఈ దుశ్చర్య కు పాల్పడిన వారికి సద్బుద్ధిని ఇవ్వమని, త్వరలో సాధన కుటీర్‌  పునఃనిర్మాణం కోసం శక్తిని ఇవ్వమని ఆ సరస్వతిమాతను వేడుకుంటున్నాము.  భారత్ మాతా కీ జై 🙏.  

 :~team సాద్రి

No comments:

Post a Comment