Friday, April 26, 2024

సర్వo సిద్ధమవుతున్న సాధన కుటీర్

పల్లె ఆణిముత్యాల సాధన శిబిరం కోసం కావాల్సిన ప్రతీ  అవసరాన్ని అతి కష్టంగా నైనా పూర్తి చేయిస్తూ....
సాధన శిబిరం కోసం సర్వం సిద్ధమవుతున్న సాధన కుటీర్..
ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏...
పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం సంకల్పించిన  కార్యానికి చేయూత అందిస్తున్న ప్రతీ హృదయానికి శుభాభినందనలు💐.
వచ్చిన అవరోధాలు అన్నీ అధికమించి మూడేళ్ల తరువాత పల్లె ఆణిముత్యాల శిబిరం కోసం సాధన కుటీర్ లోని ప్రతీ చెట్టూ, ప్రతీ రాయి ఎదురు చూస్తున్నాయి.
వారి ఎదుగుదలకు తాము అండగా ఉంటున్నందుకు ఆనందిస్తున్నాయి..
ఆసరా అవుతున్న ప్రతీ సహృదయ శక్తికి ప్రణమిల్లుతూ స్వాగతం పలుకుతున్నాయి.

సాధన శిబిరం - 2024

ప్రతిభను గుర్తిద్దాం - ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం 

సరైన సమయంలో ఆపన్న హస్తాల ప్రోత్సాహం అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభలు మొగ్గలోనే వాడిపోయి మరుగున పడ్డాయన్నది నిష్టురసత్యం.
మనలోని అనాసక్తుల వల్ల ఎందరో ప్రతిభావంతులకు కొంత నష్టమే జరిగినా తద్వారా సమాజానికి మాత్రం తీరనిలోటు ఏర్పడుతుందని నమ్మక తప్పని నిజం.
 అందుకే వీళ్ళను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశ ప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు తమలాంటి ప్రతిభా కణికలెందరినో పుట్టిస్తారు. 
సరైన సమయంలో వారికి మనం అందించే ఆత్మీయ ప్రోత్సాహం వారి జీవితాల్లో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి, ఆ ప్రాంత అభివృద్ధికి...దేశ ప్రగతికి బాటలు వేస్తారు.

మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలుగిస్తున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వం..అమూల్యం..అనంతం... అజరామరం...

రండీ, పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాలు వెలికి తీసి,మెరుగులు దిద్దే పవిత్ర కార్యంలో నేను సైతం అంటూ అందరం భాగస్వాములం అవుదాం.
:~ భవదీయ
సదా వెంకట్, 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్,

Tuesday, April 16, 2024

Sports Wing Meeting

GSF Sports Wing Preparatory Meeting for 20Days SPORTS CAMP frm 28th April @ GSF Sadhana Kuteer.

Saturday, April 13, 2024

*శ్రేయోభిలాషులకు సాదర ఆహ్వానం*

*జ్ఞానసరస్వతి ఫౌండేషన్* శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు మరియు పూర్వ విద్యార్థులకు స్నేహ పూర్వక శుభాబినందనలు.
(విషయం కొంచం పెద్దగా ఉన్నది, పూర్తిగా చదివితే తెలుస్తుంది)
ప్రతిభావంతుడైన విద్యార్థి కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా ఉండాలి అనే సామాజిక బాధ్యతతో GSF గత 15ఏళ్లుగా ప్రభుత్వ బడుల విద్యార్థుల వికాసం కోసం పనిలో ఉన్నది.
ఆశయ స్ఫూర్తితో జరుగుతున్న ఈ విద్యా మహాయజ్ఞంలో విద్యార్థుల వికాసం కోసం అనేక రకాల కార్యక్రమాలు @ *దేశభక్తి గేయాల పోటీలు,ప్రతిభా పురస్కారాలు, ప్రభుత్వ బడుల వార్షికోత్సవాలు, మొక్కను బ్రతికిద్దాం, అమ్మాయిలకు సైకిళ్ల అందజేత, సంకల్ప దివస్, లక్ష్యం శిబిరాలు, సాధన శిబిరాలు,  సాధన గ్రంథాలయాలు, SAADRI  ద్వారా అమ్మాయిలకు SHE  కార్యాలు నిర్వహించబడ్డాయి*..     కాలగమనంలో వాటన్నిటి అనుభవ సారమే *GSF_SAC అనే వికసిత కార్యం*..

*గత 15ఏళ్లుగా జరిగిన/జరుగుతున్న కార్యాలకు వ్యక్తులుగా, వ్యవస్థలుగా సంస్థలుగా అనేక మంది బాసటగా నిలిచారు*..

నిజాయితీగా జరిగే ప్రతీ పనిని ప్రకృతి అoడగా ఉటుoదన్న మాటలు అక్షర సత్యాలు.
పల్లె ఆణిముత్యాల వికాసం కోసం నిరంతరం జరిగే కార్యక్రమాలకు *ప్రకృతి ప్రసాదంగా వినోబా నగర్ లో స్థలం దొరకడం, దానికి సాధన కుటీర్ అని నామకరణం చేసుకుని, ప్రభుత్వ బడుల విద్యార్థుల వికాసం కోసం నిర్మాణాత్మక కార్యాలు @ GSF SAC Sports Academics & Cultural జరుగుతుoడటం అన్నీ ప్రకృతి నిర్ణయలుగానే భావిస్తాం*..
సంస్థ ప్రారంభమై పుష్కర కాలం పూర్తయిన సందర్భంలో జ్ఞాన పుష్కరాల కోసం సిద్ధమవుతున్న సమయంలో కరోనా వచ్చింది.. 
కరోనా సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని సాధన కుటీర్ సుందరీకరణ చేసుకున్నాం. కరోనా కాలం పూర్తవుతున్న సందర్భంలో *పూర్తి స్థాయిలో పల్లె ఆణిముత్యాల వికసిత  కార్యక్రమాలకు సిద్ధం అవుతున్న వేళ ఈర్ష్య పరులు, అక్రమార్కులచే సాధన కుటీర్ లోని కట్టడాలు అక్రమంగా కూల్చబడ్డాయి.*

కూల్చడమే కాదు, సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కాని విఫలం అయ్యారు. మన పనికి ప్రకృతి అoడగా నిలబడిoది.
*ఆకస్మికంగా జరిగిన దుశ్చర్య వలన GSF కార్యక్రమాల్లో స్తబ్దత ఏర్పడింది. అదే సందర్బంగా అoడగా ఉన్న కొన్ని సంస్థలు, వ్యక్తులు ఒక్కొక్కరుగా పక్కకు జరగడం వలన శూన్యం ఏర్పడింది.*
 
*నమ్మిన పని కోసం ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనం అడుగులు వేస్తే ఎప్పుడు ఎవరికి కలపాలో ఎప్పుడు ఎవరిని జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది అన్న మాట నిజమైoది.*

*అతి స్వల్ప కాలంలోనే మెల్లగా నిల దొక్కుకోవడం ప్రారంభం అయింది. ఆపద కాలంలో, అత్యవసర సమయంలో అండగా  కొందరు వ్యక్తుల సేవలు ఎప్పటికీ మరవలేము అదేవిధంగా ఆపద కాలంలో దూరం జరిగిన వారి సేవలు మరువలేను..*
 
*పెద్దలు చెప్పినట్టు మనకు ఆపదలు, విపత్తులు ఊరికనే రావు, అవి మన శక్తి సామర్థ్యాలను పరిశీలించడానికి, మన, పరాయి ఎవరు అని చూపడానికి వస్తాయి* అంటారు..
ఆ పరిణామాల తరువాత కొన్ని ఇతర *యువత వికాస కార్యాలకు వేదికైన సాధన కుటీర్ మెల్లగా తన Core Activity వైపు అడుగులు వేస్తుంది.*
*SAC ACTIVITY బాగంగా Sports లో కబడ్డీ & వాలీబాల్ ఆటలో NEEDY, DESERVING & TALENTED Students ని ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నాo*.

Feb 7వ తేదీన ఎంపిక చేసిన విద్యార్థులకు మార్చ్ 31 నుండి ఏప్రిల్ 2వరకు శిబిరం నిర్వహించబడింది.

సంవత్సరంలో 60-75 రోజుల శిక్షణలో భాగంగా *20రోజుల శిబిరం  *ఏప్రిల్ 27నుండి ప్రారంభం అవుతుంది.*
*ఎన్ని వ్యవ ప్రయాసలు ఎదురైనా ఈ శిబిరం నిరహించాలనుకున్న సంకల్పానికి ప్రకృతి మెల్లగా సహకరిస్తుంది*.. 
*GSF Sports Academy వైపుగా అడుగులు వేస్తున్నది*.

ఈ సందర్భంలో  నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి ప్రకృతి తలవంచి సహకరిస్తుందని శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు చెప్పే వాక్యాలు నిజమే నమ్మకం కలిగింది.
పూర్తిగా *కనుమరుగు అవుతుందని అనుకున్న సందర్భం నుండి మళ్ళీ నిటారుగా నిలిపిన ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏*..

*ఆపద సమయంలో దూరం జరిగిన వారికి మరియు అండగా ఉన్నవారికి కృతజ్ఞతాబివందనాలు.. వారి వల్లే మనం ఇంకా శక్తి సామర్థ్యాలు పెంపొందిoచుకున్నాం.* ముందుకు సాగుదాం.
 *పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం నిరంతర సాధనలో ఉందాం - వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేద్దాం*.
*ప్రతీ సంస్థ/ వ్యవస్థ  రెండు మూలలపై ఆధారపడుతుంది. ఒకటి సమయం ఇచ్చే కార్యకర్తలు రెండు సంపద చేకూర్చే వ్యక్తులు. ఈ రెండింటి పైనే ఆ సంస్థ యొక్క కార్యాలు, కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయి.*
సామాజిక హితం కోరే ఒక వ్యక్తిగా పై రెండిటిలో  మనకు అనుకూలమైన ఏ విభాగంలో నైనా మనం నిలవాలి..రేపటి తరం కోసం జరిగే ప్రయత్నంలో భాగస్తులం కావాలి.
కావున అవకాశం ఉన్న అందరినీ GSF సాదరoగా ఆహ్వానిస్తున్నది.
*పల్లె ఆణిముత్యాల వికాసం కోసం జరుగుతున్న సాధన శిబిరాలకు మీ వంతు సహకారం(సమయం - సంపద సమర్పణ) చేసి భాగస్వామ్యం కండి అని ఆహ్వానిస్తున్నది.*

భవదీయ
:~ సదా వెంకట్,
Founder, GSF.

Thursday, April 4, 2024

3Day SPORTS CAMP

GNANA SARASWATHI FOUNDATION.
ప్రాంభమైన పల్లె ఆణిముత్యాల 
సాధన శిబిరం @ Sports Camp 

 ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశంతో #GSF_SAC ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు సెలవు రోజులలో నిపుణులైన శిక్షకులచే ఇవ్వాలని Feb 7వ తేదిన #కబడ్డీ & #వాలీబాల్ లో 150 విద్యార్థులకు 3 రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం (3daysPreparatory Camp) ఈ రోజు  ప్రారంభం జరిగింది.
ఈ రోజు #సాధనకుటీర్ లో విద్యార్థుల వారి తల్లిదండ్రుల & ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి శిబిరం నియమ నిబంధనలు తెలిపారు.
ఈ మూడు రోజుల శిబిరం అనంతరం #APRIL_25వ తేదీ నుండి 20 రోజుల పాటు పూర్తి స్థాయి శిబిరం ఉంటుందని #GSF వ్యవస్థాపకులు 
#సదావెంకట్ గారు తెలిపారు*.
అదే విధంగా తెలంగాణలో  పనిచేస్తున్న వివిధ  స్వచ్ఛంద సంస్థల  ప్రతినిధుల సమ్మేళనం జరిగింది. #సంఘమిత్రక్లబ్ పేరున ప్రతీ నెలలో చివరి ఆదివారం జరిగే సమావేశం ఈ రోజు సాధన కుటీర్ లో జరిగింది.
ఈ రోజు #సాధనకుటీర్ జరిగిన 159వ వారం #భారతమాతహారతి కార్యక్రమoలో పాల్గొన్న #సంఘమిత్ర_ప్రతినిధులబృందం సమక్షంలో #కబడ్డీ & #వాలీబాల్ క్రీడల శిక్షణ ప్రారంభం జరిగింది.
సంఘమిత్ర బృందంలో వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ మాధవ రెడ్డి గారు, శ్రీ బుచ్చన్న, Dr. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Monday, April 1, 2024

SPORTS Praporatry Camp


Sports Preparatory Camp 

ప్రాంభమైన పల్లె ఆణిముత్యాల సాధన శిబిరం.
 ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశంతో GSF_SAC ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు సెలవు రోజులలో నిపుణులైన శిక్షకులచే ఇవ్వాలని Feb 7వ తేదిన కబడ్డీ &  వాలీబాల్ లో 150 విద్యార్థులకు శిక్షణ శిబిరం ఈ రోజు  ప్రారంభం జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ లో విద్యార్థుల వారి తల్లిదండ్రుల & ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి శిబిరం నియమ నిబంధనలు తెలిపారు.
ఈ మూడు రోజుల శిబిరం అనంతరం April 25వ తేదీ నుండి 20 రోజుల పాటు పూర్తి స్థాయి శిబిరం ఉంటుందని GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు తెలిపారు*.

అదే విధంగా తెలంగాణలో  పనిచేస్తున్న వివిధ  స్వచ్ఛంద సంస్థల  ప్రతినిధుల సమ్మేళనం జరిగింది. సంఘమిత్ర క్లబ్ పేరున ప్రతీ నెలలో చివరి ఆదివారం జరిగే సమావేశం ఈ రోజు సాధన కుటీర్ లో జరిగింది.
ఈ రోజు సాధన కుటీర్ జరిగిన 159వ వారం భారత మాత హారతి కార్యక్రమoలో పాల్గొన్న సంఘమిత్ర  ప్రతినిధుల బృందం సమక్షంలో కబడ్డీ & వాలీబాల్ క్రీడల శిక్షణ ప్రారంభం జరిగింది.
సంఘమిత్ర బృందంలో వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ మాధవ రెడ్డి గారు, శ్రీ బుచ్చన్న, Dr. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.