Thursday, January 25, 2024

SAADRI Event 24.01.2024

GSF_ SAADRI "SHE" awareness sessions conducted on 24/01/24 at Karthikeya degree college Ibrahimpatan.
Dr .Vasudha Rani, Principal of Pananeeya  Mahavidhyalaya BEd college, and  Team leader of SAADRI Self awareness   group took self Awareness of Goals Task and Planning skills session ( SAGT)   students interestingly participated in  the activity.
Smt .Pramoda, incharge of SAADRI took  yoga mudras session for increase brain power ,for glowing skin and for hormonal balance
Thanks to College Management for giving this opportunity to students to learn various things
Team GSF_ SAADRI

Friday, January 12, 2024

VVT-2024 FINAL

VIVEKA VOLLYBALL TOURNAMENT -2024 సంపూర్ణం.*
స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని GSF_సాధన కుటీర్ లో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వాలీబాల్ పోటీలు ఈ రోజుతో ముగిశాయి.*
లీగ్ పద్దతిలో జరిగిన పోటీలలో ఎంపిక చేసిన 12 జట్లకు మాత్రమే అవకాశం దక్కింది*.
ఈ నెల 7వ తేదీ ప్రారంభమై ఈ రోజు సెమీ ఫైనల్ & ఫైనల్ పోటీలతో టోర్నమెంట్  సపూర్ణమయిoది.
టోర్నమెంట్  *మొదటి స్థానంలో PC తండా*, *ద్వితీయ స్థానంలో నందివనపర్తి* & *తృతీయ స్థానంలో చింటపట్ల గ్రామాల జట్లు నిలిచాయి*. గెలుపొందిన జట్లకు అతిథుల ద్వారా. వాలీబాల్ క్రీడా సామాగ్రి అందించ బడింది.
ఫైనల్ *పోటీలకు శ్రీ రమేష్ గారు(IIT_Bombay, Ex TCS Employee,)* *శ్రీమతి భారతి దేవి గారు, GSF_SAADI Advisory Member,*
*Prof. హరిగోపాల్ garu(Retd. Director, IPEP,Hyd), శ్రీమతి. T.సుబ్బలక్ష్మి గారు, Retd. Principal, శ్రీ.బుచ్చయ్య, సామాజిక కార్యకర్త గార్లు అతిథులుగా పాల్గొని బహుమతుల అందజేశారు*.
ప్రత్యేక ఆట కనబరచిన క్రీడాకారులకు వారు స్వంతంగా CASH ప్రైజ్ అందించారు..
అతిథులు తమాభిప్రాయం తెలుపుతూ పల్లెల్లోని ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, ఆవైపుగా GSF ప్రయత్నం అద్భుతంగా ఉన్నదని అన్నారు..
*GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ పల్లె ఆణిముత్యాల  ప్రగతి కోసమే ఈ సాధన కుటీర్ పనిలో ఉన్నది*. *పల్లెల్లోని ప్రభుత్వ బడులలో చదివే ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సమయంలో ఆసరా ఉండాలని ఆశించి GSF_SAC @ Sports l, Academic & Cultural విభాగాలలో నిరుపేద ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని  శిబిరాల ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు*. *Sports లో కబడ్డీ & వాలీబాల్ లలో పిబ్రవరి మొదటి వారంలో జిల్లా స్థాయి ఎoపకలు నిర్వహించి అనంతరం శిబిరాలు నిర్వహిస్తాము, అందులో ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా శిబిరాలలో సహకారం అందించాలని అభ్యర్థన చేశారు*. 

*ఈ పోటీలు నిర్వహించిన GSF_SAC Sports Wing incharge శంకర్ , వెంకటేష్ మరియు జనార్ధన్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
:~ Shankar, Sports Wing of GSF_SAC*

Tuesday, January 9, 2024

VVT- 2024 Day 2

వివేకా వాలీబాల్ టోర్నమెంట్ -2024.

PHOOL B పోటీలు పూర్తి.
GSF సాధన కుటీర్ లో ఎంపిక చేసిన టీం లకు లీగ్ పద్దతిలో జరుగుతున్న వాలీబాల్ పోటీలలో Phool B జట్లకు ఈ రోజు నిర్వహించబడ్డాయి.
సాయంత్రం వరకు జరిగిన పోటీలకు శ్రీ కుమార స్వామి _ (Retd.Dy commiasioner, SSC Examination Board),
భాస్కర్ రెడ్డి గారు _ President, PET Association,RR. Dist,
చెన్నకేశవ రెడ్డి గారు_Secretory, SGF,RR Dist,   శ్రీ దేవదాస్ గారు_Secretory ,SGF IBP Zone, శ్రీ రవి గారు_Secretory,PETA,RR Dist., శ్రీ వెంకటేష్ గారు_ Treasurer, PETA,RR Dist. పాల్గొన్నారు.
పల్లెలోని ప్రభుత్వ బడుల్లో చదివే ఆర్థిక నిరుపేద విద్యార్థులకు GSF చేసే సేవలను మా వంతు సహకారం తప్పక అందిస్తామని తెలిపారు.
GSF_SAC లో బాగంగా స్పోర్ట్స్ విభాగం ద్వారా కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో ప్రభుత్వ బడులలో చదివే నిరుపేద  ప్రతిభావంతులకు నిర్వహించే శిక్షణ శిబిరాల కోసం విద్యార్థుల ఎంపికలో SGF తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
:~ by Shankar,
Sports Wing of GSF_SAC.

Sunday, January 7, 2024

INAUGURATION of VVT -2024

#వివేక_వాలీబాల్_టోర్నమెంట్ ప్రారంభం.
@ #GSF_సాధనకుటీర్, వినోభానగర్, IBP.
స్వామివివేకానంద_జయంతి పురస్కరించకుని యువతకు వాలీవాల్ పోటీలు ప్రారంభమయినాయి.
#GSF_సాధనకుటీర్ లో ప్రముఖ సేవాతత్పరులు, నిరాడంబర వ్యక్తిత్వం గల కరుడు గట్టిన దేశభక్తులు
 శ్రీ #CBR_ప్రసాద్ గారు మరియు  #ACP_ K.S. Rao గారు ప్రారoభించారు..
#GSF_క్రీడా_విభాగం ఆధ్వర్యంలో నివహిస్తున్న  ఈ పోటీలలో  IBP పరిసర గ్రామాల నుండి ఎంపిక చేసిన 12 టీంలకు లీగ్ సిస్టంలో పోటీలు నిర్వహస్తున్నారు.
గౌరవ అతిథులు శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రతిభా వంతులకు సరైన సమయంలో చేయూత నివ్వడం అత్యవసరం,
నా ఆస్తిలో ఎక్కువ శాతం అలాంటి వాటికే ఉపయోగిస్తున్న...
#GSF ద్వారా అలాంటి ప్రయత్నం జరగడం అభినందనీయం అని అన్నారు.
ACP, K.S రావు గారు మాట్లాడుతూ GSF ద్వారా గ్రామీణ విద్యార్థులకు అద్భుత అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయం.అదే విధముగా వారు డ్రగ్స్ నిర్మూలన విషయంపై పోరాడాలి, దానికి మా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు..
GSF ఫౌండర్ శ్రీ #సదావెంకట్ గారు మాట్లాడుతూ....
యువతకు ప్రేరణా మంత్రాలను అందించిన స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా గత నాలుగేళ్లుగా సాధన కుటీర్ లో వాలీబాల్ పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాము..
ఈ రోజున ప్రారంభమై పోటీలు 12వ తేదీ ఉదయంతో పూర్తి చేసి బహుమతులు అందించ వాడుతాయి..
ఈ కార్యక్రమంలో జ్ఞానసరస్వతి పౌండేషన్  క్రీడా విభాగం ఇంచార్జీ శంకర్, నిర్వాహకులు రాజు, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, January 6, 2024

VIVEKA VOLLYBALL TM-2024

GNANA SARASWATHI FOUNDATION
#Sadhaa Kuteer, Sy.NO 2, Vinobha Nagar,IBP.
యువతకు ప్రేరణా మంత్రాలను అందజేసిన స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12 తేదీన యువతకు వాలీబాల్ టోర్నమెంట్  నిర్వహించడం ఆనవాయితీగా నాలుగేళ్లుగా జరుగుచున్నది.
ఎంపిక చేసిన కొన్ని జట్లకు మాత్రమే లీగ్ సిస్టమ్ లో ఈ పోటీలు  నిర్వహించ బడుచున్నాయి.

GSF_సాధన కుటీర్, వినోబా నగర్ లో  జనవరి 7వ తేదీ ఉ.10 గంలకు ప్రారంభమైతాయి. 
12వ తేదీ వివేకానంద జన్మదినం సదర్భంగా బహుమతుల ప్రధానo ఉంటుంది..
:~సదా వెంకట్
Founder and Managing Trustee, GSF.