Wednesday, December 27, 2023

కాల నిర్ణయానికి స్వాగతం

*ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏🏼*
బడుగు బలహీన వర్గాల పిల్లలే నేడు పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారనేది మనందరికీ తెలుసు...వారిలో ప్రతిభకు కొదవ లేదు..  
సరైన సమయంలో మార్గదర్శనంతో పాటు ఆపన్న హస్తాల ప్రోత్సహం  అందక, ఏ గుర్తింపుకు నోచుకోక ఎందరో ప్రతిభావంతుల ప్రతిభ మొగ్గలోనే వాడిపోయి మరుగున పడ్డాయన్నది నిష్టురసత్యం...
మనలోని అనాసక్తులవల్ల ఎందరో ప్రతిభావంతులకు కొంత నష్టమే జరిగినా, తద్వారా సమాజానికి మాత్రం తీరని లోటు ఏర్పడుతుందని నమ్మక తప్పని నిజం. అందుకే అలాంటి వారిని సరైన సమయంలో గుర్తించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే దేశ ప్రగతికి కరదీపికలవుతారు. అంతేకాదు  తమలాంటి ప్రతిభా కణికలెందరికో ప్రేరణవుతారు.  వారికి మనం అందించే ప్రోత్సాహం, వారి జీవితాలలో వెలుగులు నింపి, తమ ప్రాంత ప్రతిభా రూపాలను ప్రోత్సహించి ఆ ప్రాంతపు అభివృద్ధికి...తద్వారా దేశ ప్రగతికి బాటలు వేస్తారు.. మన ప్రోత్సాహమే పలు దీపాలను వెలిగిస్తున్నప్పుడు మనలో కలిగే తృప్తి అపూర్వం...
అమూల్యం అనంతం...
పల్లె మట్టిలో దాగున్న అసంఖ్యాక ఆణిముత్యాల పతిభను సరైన సమయంలో మెరుగులు దిద్ది సమాజానికి పరిచయం చేయాలనే 
పవిత్ర కార్యాన్ని బాధ్యతగా బావించి గత 15 ఏళ్లుగా జ్ఞానసరస్వతి పౌండేషన్
 పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం ప్రయత్నం కొనసాగిస్తున్నది..
నిజాయితీగా జరిగే ఏ ఉద్యామానికైనా,  ఏ కార్యానికైనా ప్రకృతి తలవంచి సహకరిస్తుందని నమ్మి, ఆచరిస్తున్నది GSF..
    సదాశయంగా సంకల్పoతో  సేవను బాధ్యతగా నిర్వహిస్తున పనికి ప్రకృతి అండగా నిలబడింది..నిర్వహించిన ప్రతీ కార్యానికి తాను గుప్త సహకారిగా ఉన్నది.

*ఆటు_పొట్లను ఎదురిచ్చి, వాటిని ఎదుర్కొనే శక్తినీ తానే ప్రసాదించింది ప్రకృతి.. 

*పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం పుష్కరకాలం  నిర్వహించిన కార్యక్రమాల సారంగా అనేక కొత్త ఆలోచనలు మదిలో కలిగించి వాటి ఆచరణకూ శక్తిని ఇచ్చి, అవసరమైన ఉపకరణాలను తానే సమకూర్చుతుంది*...
ఇన్నేళ్ళ కార్యక్రమాల సారంగా *విద్యార్థులకు నిర్మాణాత్మకoగా ఉపయోగపడే కార్యాలను మదిలో చొప్పించి, నిర్వహణకు తన ఉపకరణాలుగా అనేక మంది సేవా తత్పరులను తోడిచ్చి పద పదరా సదా అని తోసేసింది.*
 *పది రూపాయలు జేబులో లేకున్నా 10 లక్షల పనులకు భరోసా ఇచ్చి పూర్తి చేయించిన ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏🏼*.

*దేవతా కాలం నుండీ ఉన్న అసురుల మాదిరే, రూపం మారి అనేక రూపాల్లో ఉన్న అసూయ పరుల అనాలోచిత చర్యల కారణంగా  రెండేళ్ల క్రిత్రం అక్రమంగా కూల్చబడ్డ 
పల్లె ఆణిముత్యాల కలల సౌధం సాధన కుటీర్  మెల్లగా తన పూర్వ స్థితికి చేరుకుంటుంది, చేరుకోవాలి కూడా..
 *SAC_Sports,Academics, Cultural అంశాలలో ప్రతిభ గల ఆర్థిక నిరుపేదల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే సదాశయంతో ముందుకు సాగుతున్నది..

ఆశయంతో సాగుతున్న ఈ పవిత్ర కార్యానికి నేను సైతం అంటూ అండగా ఉంటున్న ప్రతీ వ్యక్తికి, వ్యవస్థకు హృదయ పూర్వక ధన్యవాదాలు. 

నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి ప్రకృతి అండగా ఉంటుందని నమ్మి, ఆచరణలో ఇసుమంతైనా. నిజాయితీని సడలనివ్వని శక్తిని ఇమ్మని భవంతున్ని  మనసా కోరుతూ..

2022 పిబ్రవరిలో  అక్రమంగా కూల్చబడ్డ సాధన కుటీర్ స్వాగత ద్వారo మళ్లీ నిటారుగా నిలబడి పల్లె ఆణిముత్యాల ఆగమనం కోసం ఎదురు చూస్తున్నది*..

 ఈ రోజే ఏర్పాటు చేయబడ్డ స్వాగత ద్వారం(GATE).

:~ *సదా వెంకట్*
   Founder_GSF.
(అక్రమంగా కూల్చిన సమాచారం శ్రేయోిలాషులకూ, సమాజానికి తెలిపిన కారణంగా పున: నిర్మాణ స్థితులు తెలపాలనే ఉద్దేశ్యంతో)

Sunday, December 24, 2023

Review on SADHANA LIBRARYs

Review meeting of Sadhana Village Libraries.       
In order to develop book reading in the younger generations, GSF has initiated to establish libraries in different villages. These libraries are established with the support of MCKS foundation and others in 10 different villages. As part of a regular review meeting of the working of these libraries a review meeting is held today at Sadhana kuteer, GSF. Apart from  reviewing the working of village libraries, it has been resolved in this meeting that, apart from improving the readership in the libraries various activities related to the development of the Indian knowledge system are to be planned in the coming days.

Friday, December 22, 2023

యోగ సాధకులు @ కర్ణాటక

సమాజ హితం కోరి జరిగే ఏ కార్యానికైనా  ప్రకృతి సమయానుకూలంగా తన ఉపకరణాలను తానే ఎంచుకుంటుంది, ఎన్నుకుంటుంది.... భాగ్యనగర్ లో జరిగే యోగ సాధకుల సమ్మేళనానికి కర్ణాటక/తమిళనాడు నుండి వచ్చిన సాధకులు ఒక్కరోజు సాధన కుటీర్ లో సేద తీరడానికి వచ్చారు.. వారు వెళ్ళేటప్పడు తెలిసింది కొందరు కర్ణాటకలో 165 fts ఎత్తైన పంచముఖ హనుమాన్ విగ్రహానికి దగ్గరలో ఉంటారని.. గత నెలలోనే అనుకున్నాం ఆ విగ్రహ సందర్శనకు వెళ్లాలని. ఇప్పుడు వారు  రమ్మని ఆహ్వానించారు... ఆశ్చర్యం తో కూడా ఆనందం.

Saturday, December 16, 2023

CBR ప్రసాద్ గారి స్ఫూర్తి

సాధారణంగా కనిపించే 78 ఏండ్ల అసాధారణ వ్యక్తిత్వపు నిత్య యవ్వనుడితో పొందిన నిండైన స్ఫూర్తి.*
*ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, వారిని దేశం గర్వించదగ్గ వారిగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో దేశ గౌరవం పెంపొందిoచాలనే ఆశయంతో నిండిన  కసితో ఉన్న 78 ఏండ్ల యువకుడు శ్రీ CBR ప్రసాద్ గారు*..
తన 5 ఎండ్ల వయసు నుoడే దేశంకోసం ఏదైనా సాధించాలనే తపనతో మిలట్రీలో చేరి, దేశానికి కొంతకాలం సేవలందించి, చిన్న వయసులోనే ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వ్యాపారం చేసి కసిగా డబ్బులు సంపాదించి, సంపాదనలో సగభాగం సమాజానికి సమర్పణ చేస్తున్న  సమాజ హితకారి శ్రీ CBR ప్రసాద్ గారు.
*గ్రామీణ క్రీడాకారులను ఒలింపిక్స్ లో మెడల్స్ సాదిoచే విధంగా తయారు చేసి, 78 ఏండ్ల వయసులో కూడా అంతే ఉత్సాహంతో  Sports Academy ల ద్వారా శిక్షణ ఇస్తున్న సాదారణంగా కనిపించే అసాధారణ స్ఫూర్తి ప్రదాత*..
*GSF_SAC లోని స్పోర్ట్స్ విభాగంలో వారి సమన్వయ సహకారం ఆశిస్తూ ఈ రోజు కలిసిన GSF బృందం.*
మొదటి విడతగా జరిగిన సమావేశంలో వారి స్పందన అద్బుతం..
జనవరి మొదటి వారంలో సాధన కుటీర్ లో నిర్వహించే క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి  ఆహ్వానించడం జరిగింది*..
*వారి సమన్వయ సహకారంతో  గ్రామీణ ఆర్థిక నిరుపేద క్రీడాకారులు కొందరికైనా మేలు జరగాలని, జరుగుతుందని ఆశిదాం.*
:~ సదా వెంకట్,GSF.

Friday, December 15, 2023

SAADRI tm with Seethakka & NIN

GSF SAADRI team went to *NIN for the guidelines to SAADRI' Swasth Project* for adolescent girls of Govt schools. *SAADRI team discussed with Dr.Bhanu prakash garu( scientist 'G'&Head Biochemistry)and his team about the project*.They  promise to give support .

Unexpectedly... Sadri's team got a chance to meet *Women and child welfare Minister Sitakka* too. She said that  according to the time a meeting will be arranged with NGOs working for girls and women. 
After two academic years of unavoidable reasons,now GNANA SARASWATHI FOUNDATION is preparing for total development of Rural Government students....Sadri programs are a part of this.
:~ team SAADRI _ A Women wing of GSF