ప్రకృతికి ఎప్పటికీ ఋణపడే ఉండాలి.ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పనికి కావాల్సిన ఉపకారణాలను తాను సమకూర్చుకుంటూనే ఉంటుంది.
ఆ ఉపకరణం మనమే అయితే అద్భుతం,మహా అదృష్టం.
ఎవరు ఉన్నా, లేకున్నా నమ్మిన పని కోసం చిట్ట చివరి వరకు మనం అడుగులు వేస్తె, ఆ పని కోసం ఎప్పుడు ఎవరిని కలపాలో, ఎవరిని జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుoదనే మాట అక్షర సత్యం.
స్థలము పాతదే, మొక్కలూ పాతవే.. కాకుంటే కొంత శ్రద్ద చూపడం అంతే...
దానికే ఎంత మార్పు. పూర్తిగా నాశనం అయినాయి అనుకున్న మొక్కలు మళ్ళీ చిగురిస్తే, వాటి సంరక్షణ పట్ల కొద్దిగా శ్రద్దచూపి చుట్టూత ఉన్న కలుపును తీసి, పాదులు తీసి, నీరు పోస్తుంటే మల్లీ కాశ్మీరి గులాబీ వనం తయ్యార్, రోడ్డుతా క్రోటాన్ @ సాధన కుటిర్..
సాధకుల శ్రద్దకు జోహార్లు.
:~సదా వెంకట్.
No comments:
Post a Comment