Saturday, June 18, 2022

Return back to SOCIETY

సామూహిక సూర్య నమస్కారాలు సాధన చేయడం షురూ చేసిన సాధన కుటీర్ సాధకులు... 
మెడిటేషన్ కూడా..
 శుభo.

Thursday, June 16, 2022

GSF Students met the National Minority commission member

National Minority Commission Member Shahzadi Begum గారిని కలిసిన జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులు.


సాధన కుటీర్ అక్రమ కూల్చివేతపై తమ విన్నపాన్ని తెలిపి, సాధన కుటీర్ ని సందర్శించి  అక్కడ జరిగిన అక్రమ కూల్చివేతలను ప్రత్యక్షంగా చూసి  కమిషన్ ద్వారా సరైన న్యాయం,సహకారం అందించవలసిందిగా తమ విన్నపాన్ని అందించిన  జ్ఞానసరస్వతి ఫౌండేషన్ లో శిబిరాలలో  పాల్గొన్న  విద్యార్థులు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే తమలాంటి అనేక  మంది విద్యార్థుల నిగూడ  ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, చేయూత అందిస్తున్న GSF సాధన కుటీర్ ని అక్రమంగా ధ్వంసం చేయడం ద్వారా అనేక మంది గ్రామీణ ఆర్ధిక నిరుపేద విద్యార్థులకు అన్యాయo జరుగుతుంది..  తమలోని నైపుణ్యాలను శిబిరాలలో  నిష్ణాతులైన శిక్షకుల ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది.
కావున గ్రామీణ ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలుస్తున్న GSF సాధన కుటీర్ కు Minority Commission ద్వారా సరైన న్యాయం జరగాలని అభ్యర్ధన చేశారు. స్పందిoచిన Minority Commission Member Shehajadi Begum గారు ఈ విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరలో సాధన కుటీర్ ను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకుంటానని తెలిపారు.
:~ GSF Students.

GSF SVL at Manchal

మంచాల గ్రామంలో "జ్ఞాన సరస్వతి ఫౌండేషన్" సౌజన్యంతో పోటీ పరీక్షార్థులకు కోసం ప్రత్యేక లైబ్రరీని బాలుర ఉన్నత పాఠశాల మంచాల లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభ సమావేశంలో వి ఆర్ వన్ ఫౌండేషన్ సభ్యులు శ్రీ బిక్షపతి సార్ గారు పాల్గొని టెట్ పరీక్ష పూర్తి కాగానే కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది సరికాదని ఉద్యోగ సంపాదన కొరకు నిరంతరం ఈ విలువైన పుస్తకాలలోని సమాచారం  అవగాహన చేసుకొని  పరీక్షలను విజయవంతంగా రాయాలని, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు.జి ఎస్ ఎఫ్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ...  పుస్తకాలు జ్ఞాన నిధులని వాటిని పొంది.. జీవితంలో స్థిరపడి ,సమాజానికి సేవ చేయాలని సూచించారు. కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా నిరంతరం పుస్తక పఠనం ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఖుదీరాం బోస్ జీవిత పోరాటాన్ని వివరిస్తూ... స్వాతంత్ర్యం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి... ఎంత తపన పడ్డారు! అలా ప్రతి క్షణం  మన ఉద్యోగుల లో కూడా తపన,కసి కల కలిపి  మీ కల సాధించాలి. చిత్త శుద్ధి తో మీరు చేసే జ్ఞాన పోరాటానికి మా ఫౌండేషన్ ఎల్లవేళలా సహాయ సహకారాన్ని ఇస్తుందిఅన్నారు. కార్యక్రమ సంధానం అశ్వల బాలరాజు,నవీన్,వెంకటేశ్,ఉద్యోగార్థులు పాల్గొన్నారు

Wednesday, June 15, 2022

GSF SVL at Arutla


The Gnana Saraswati foundation coordination team visited Aarutla village on 13-6-22 to inaugurate the sadhana Village library. Speaking on occasion, the Founder of the Gnana Saraswati foundation Shri. Sada Venkat Garu stated that it is necessary to inculcate the habit of reading books in children. He has also emphasized that reading books should not be stopped after getting a job but should be continued through life and knowledge gaining is a continuous process. He referred to the reading habit of Israel, where every individual reads at least 64 books a year, and in Hungary, he stated that every 500 members would have a library. Ultimately, he congratulated the Aarutla village library team for their consistent effort to establish the village library and wished the job aspirants to work hard and achieve their dream.

Monday, June 13, 2022

GSF Sadhana Village libraries inauguration in villages



It is one of the greatest moments for all the students who are preparing for competitive examinations and also for book lovers. Today, i.e., on 12-6-22, the sadhana library coordination team inaugurated three sadhana village libraries on the same day. Going into the details, at 10 AM, Mantangowrelli sadhana village library is inaugurated by the Founder and Managing trustee of Gnana Saraswati foundation Shri. Sada Venkat Garu, which is attended by Village sarpanch Vijaya Lakshmi Garu and nearly 30 job aspirants. Speaking at the event, Sada Venkat Garu has inspired the students to utilize the library and achieve their goals. He has also emphasized that it is the students' responsibility to give back to society through finances or their time for the welfare of the needy deserving, and talented students. In the evening, at 6:00 PM sadhana village library is inaugurated at Kurmidda, where sada Venkat Garu appreciates the efforts of the sadhana village library regulatory team for their efforts to establish a library though there is a lack of basic amenities; participants in the program thanked Gnana Saraswati foundation for their help in selecting the village library. They promised that with the help of the foundation and the villagers, they would make sure that the village students would develop a reading habit in the children in the village. After the inauguration of the kurmidda library, the team visited gadda mallayagudam to inaugurate the village library. The library coordination team congratulated the sadhana village library team and addressed the job aspirants to utilize the library and achieve their goals.

Wednesday, June 8, 2022

News of GSF SVL.

News Paper Clippings of GSF SVL Inauguration Program on 07.06.2022 @ MondiGowrelly  Village, Yacharam Mandle, RR Dist.

Tuesday, June 7, 2022

SVL_ MondiGowrelly.

*పుస్తకాలకు మించిన మంచి మిత్రుడు ఈ లోకంలో లేరు,పుస్తకాలను చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి:- GSF వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు* 
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాధన విలేజ్ లైబ్రరీ మొండిగౌరెల్లి గ్రామంలో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యఅతిథి శ్రీ సదా వెంకట్ గారు ప్రారంభించినారు,సదా వెంకట్ గారు మాట్లాడుతూ ఎంపిక చేసిన మొండిగౌరెల్లి గ్రామానికి గ్రంథాలయ సామాగ్రి @ బుక్ రాక్స్ 2 , చైర్1 ,టేబుల్ 1 మరియు కాంపిటీటివ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది.
 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులకు మరియు బాలలకి ఉపయోగపడే విధంగా బాలసాహిత్యం ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి.
వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తకాలు కేవలం ఉద్యోగ సాధన కోసమే కాకుండా జీవితాన్ని సాధించడానికి చదవాలి,అదొక అద్భుత సాధనగా మన దినచర్యలో ఒక భాగంగా పుస్తక పఠనం చేయాలని అన్నారు,2014 సంవత్సరం నుండి ఈ గ్రంథాలయాల కోసం  ఫౌండేషన్ విశేష ప్రయత్నం చేస్తుంది,ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అవసరమైన పుస్తకాలతో పాటు దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర పుస్తకాలు మరియు బాలలకు ఉపయోగపడే విధంగా బాలసాహిత్యం కూడా ఈ గ్రంథాలయoలో ఉంటుంది.ముఖ్యంగా బాల సాహిత్యంతో 2014-15 సంవత్సరాలలో సంచార గ్రంథాలయం మరియు 5 గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటు కూడా జరిగింది.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విడత 10 గ్రామాలలో ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్న యువత కోసం మరియు బాల సాహిత్యంతో  సాధన గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిందన్నారు,అందులో భాగంగానే నేడు మొండిగౌరెల్లి గ్రామంలో సుమారు 20 నుండి 40 మంది వరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న
5 గురు నిర్వహణ సభ్యులుగా ( Regulatory Committee) గుర్తించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది అని అన్నారు,ఈ గ్రంథాలయ ఏర్పాటుకు ఒక్క గ్రామానికి సుమారు 75 వేల రూపాయల ఖర్చుతో సామాగ్రి అందజేయడం  జరిగింది.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి,పల్లె ప్రగతి స్పెషల్ ఆఫీసర్ నర్సింహా సార్, ఉపసర్పంచ్ మేకల యాదగిరి రెడ్డి,BJP మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్,BSP మండల కన్వీనర్ గొడుకొండ్ల ప్రవీణ్,SMC చైర్మన్ కట్టెల ఆంజనేయులు,
ఉపాధ్యాయులు కొంగర జంగయ్య,మర్రిపల్లి మహేష్,కట్టెల రమేష్,వస్పరి మల్లేష్,పెండ్యాల మహేష్, గ్రామ యువజన సంఘాల సభ్యులు గుడాల వెంకటేష్, గడ్డం లింగం,శశిధర్, గ్రంథాలయ నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం రాజశేఖర్,మంతాపురం లోకేష్,నక్క మధు,బొడ్డు అనిల్  తదితరులు పాల్గొన్నారు.
:~ Regulatory Committee,
SVL ,Mondigowrelly.

Sunday, June 5, 2022

సాధన కుటీర్ ను సందర్శించిన జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజి ఆచారి గారు..

జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న బి.సి విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
సాధన కుటీర్ ను సందర్శించిన జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజి ఆచారి గారు..
 ఏమాత్రం
ముందస్తు సమాచారం  లేకుండా అక్రమ నిర్మాణాలు అనే నెపంతో సాధన కుటీర్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక తరగతి గదులు,కొన్ని పురాతన కట్టడాలను కూల్చిన విధానం అక్రమంగా ఉన్నదన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న ఒక స్వచ్ఛంద సంస్థపై ఇది దారుణమైన చర్య అని అన్నారు...
తగిన విచారణ జరిపి,
 ఇలాంటి చర్యలో పాల్గొన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని GSF సబ్యులు కోరారు.  
:~ team GSF.

Thursday, June 2, 2022

GSF met National BC Commission Chairman Sri Achari gaaru

జాతీయ బి.సి.కమీషన్ చైర్మన్ శ్రీ  ఆచారి గారిని కలిసిన జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిబిరాలలో పాల్గొన్న బి.సి. కులాల విద్యార్థులు.
 సాధన కుటీర్ అక్రమ కూల్చివేతపై తమ విన్నపాన్ని తెలిపి, సాధన కుటీర్ ని సందర్శించి  అక్కడ జరిగిన అక్రమ కూల్చివేతలను ప్రత్యక్షంగా చూసి  కమిషన్ ద్వారా సరైన న్యాయం,సహకారం అందించవలసిందిగా తమ విన్నపాన్ని అందించి  న  జ్ఞానసరస్వతి ఫౌండేషన్ లో శిబిరాలలో  పాల్గొన్న బి.సి కులాలకు చెందిన విద్యార్థులు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే తమలాంటి అనేక  మంది విద్యార్థుల నిగూడ  ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహిస్తూ, చేయూత అందిస్తున్న GSF సాధన కుటీర్ ని అక్రమంగా ధ్వంసం చేయడం ద్వారా అనేక మంది గ్రామీణ ఆర్ధిక నిరుపేద విద్యార్థులకు అన్యాయo జరుగుతుంది..  తమలోని నైపుణ్యాలను శిబిరాలలో  నిష్ణాతులైన శిక్షకుల ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది.
కావున గ్రామీణ ప్రతిభావంతులకు సరైన సమయంలో అండగా నిలుస్తున్న GSF సాధన కుటీర్ కు B.C. Commission ద్వారా సరైన న్యాయం జరగాలని అభ్యర్ధన చేశారు. స్పందిoచిన చైర్మన్ గారు త్వరలో సాధన కుటీర్ ను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకుంటానని తెలిపారు.