Thursday, June 16, 2022
GSF SVL at Manchal
మంచాల గ్రామంలో "జ్ఞాన సరస్వతి ఫౌండేషన్" సౌజన్యంతో పోటీ పరీక్షార్థులకు కోసం ప్రత్యేక లైబ్రరీని బాలుర ఉన్నత పాఠశాల మంచాల లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభ సమావేశంలో వి ఆర్ వన్ ఫౌండేషన్ సభ్యులు శ్రీ బిక్షపతి సార్ గారు పాల్గొని టెట్ పరీక్ష పూర్తి కాగానే కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది సరికాదని ఉద్యోగ సంపాదన కొరకు నిరంతరం ఈ విలువైన పుస్తకాలలోని సమాచారం అవగాహన చేసుకొని పరీక్షలను విజయవంతంగా రాయాలని, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు.జి ఎస్ ఎఫ్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ... పుస్తకాలు జ్ఞాన నిధులని వాటిని పొంది.. జీవితంలో స్థిరపడి ,సమాజానికి సేవ చేయాలని సూచించారు. కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా నిరంతరం పుస్తక పఠనం ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఖుదీరాం బోస్ జీవిత పోరాటాన్ని వివరిస్తూ... స్వాతంత్ర్యం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి... ఎంత తపన పడ్డారు! అలా ప్రతి క్షణం మన ఉద్యోగుల లో కూడా తపన,కసి కల కలిపి మీ కల సాధించాలి. చిత్త శుద్ధి తో మీరు చేసే జ్ఞాన పోరాటానికి మా ఫౌండేషన్ ఎల్లవేళలా సహాయ సహకారాన్ని ఇస్తుందిఅన్నారు. కార్యక్రమ సంధానం అశ్వల బాలరాజు,నవీన్,వెంకటేశ్,ఉద్యోగార్థులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment