Source: eenadu
కొత్తపల్లి పాఠశాల ఆదర్శం
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లో కొత్తపల్లి పర్యటనకు వచ్చారు. పాఠశాల వసతుల తీరు చూసి ఆవేదన చెందారు. గదులపై పెరిగిన మొక్కలను తీయించాలని గ్రామ పంచాయతీ వారిని కోరారు. రూ.3.5 లక్షలు మంజూరు చేయడంతో అప్పటి వరకు వర్షం వస్తే కురిసే గదులకు మరమ్మతులు చేయించారు. మరుగుదొడ్లను,ప్రహరీని బాగు చేయించి ద్వారం (గేట్) నిర్మించారు. అన్ని గదులకురంగులు వేయించారు. నాలుగు అదనపు గదులను రాజీవ్ విద్యా మిషన్ నుంచి ఎమ్మెల్యే మంజూరు చేయించడంతో నిర్మాణం గోవర్దన్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా వచ్చిన గోవర్దన్ పాఠశాల అభివృద్ధికి ఇలా శ్రీకారం చుట్టారు. గ్రామస్థులతో ఈ బడి మనదని పించేలా కార్యక్రమాలు మొదలు పెట్టారు. అందరం కలిస్తే ఆదర్శంగా చేయగలమని ఉత్తేజాన్ని నింపారు. మరింత అభివృద్దికి దాతల వేటలో పడ్డారు.
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ తోడ్పాటు
జ్ఞాన సరస్వతీ పౌండేషన్ సహకారంతో పాఠశాల వార్షికోత్సవాన్ని కార్పొరేట్ స్కూల్‌ను తలపించేలా నిర్వహించారు. విద్యార్థుల్లో ఎనలేని ఉత్సాహం నింపింది. అటు చదువులో రాణిస్తూ ఇటు క్రమశిక్షణ అలవర్చుకున్నారు. ప్రభుత్వం పాఠశాలలకిచ్చే సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్నారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుని ప్రతి గదికి విద్యుత్ దీపాలు అమర్చుకున్నారు. అన్ని గదులకు రంగులు వేయించి గోడలపై స్ఫూర్తినిచ్చే సూక్తులు రాయించారు.
రోటరీ క్లబ్ సహకారంతో...
ఎల్బీనగర్ రోటరీ క్లబ్ సహకారంతో అన్ని తరగతులకు బెంచీలు సమకూర్చుకున్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు రాంరెడ్డి ఇక్కడి ఉపాధ్యాయుల పనితీరు చూసి అడిగిన వెంటనే సుముఖత వ్యక్తం చేశారు.వాటాధనం నూ. 20 వేలను స్థానిక తెరాస నాయకులు కె.నారాయణరెడ్డి సమకూర్చారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అన్ని గదుల్లోనూ బెంచీలు సరిపడా ఉన్నాయి. ఉపాధ్యాయులుండే కార్యాలయం గదిని చూడచక్కగా మార్చుకున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను వీడదీస్తూ ఉన్న గోడను తొలగించి ఆవరణను విశాలంగా మార్చారు.
ప్రాథమిక పాఠశాల కూడా...
ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే ఉన్నత పాఠశాలను నడుపుతున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేశ్ గోవర్దన్‌కు అండగా నిలిచి కలిసి పనిచేస్తుండటంతో పాఠశాల అభివృద్ధి వేగంగా సాగింది. పోటీపడి సౌకర్యాలు మెరుగుపర్చారు. ప్రాథమిక పాఠశాలలో దృశ్య శ్రవణం ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. గోడలపై పాఠ్యంశాలకు సంబంధించిన అక్షరాలు ఫ్లెక్సీల ద్వారా అమర్చి విద్యార్థులు వాటిని కంఠస్థం చేసేలా చూస్తున్నారు.
మధ్యాహ్నం భోజనానికి శుద్ధిజలం
జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి శుద్ధిజలం ప్లాంట్‌లను దాతల సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా పౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్‌రెడ్డి మొదటి ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారు. రూ.1.5 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేయగా విద్యార్థుల తాగునీటి కష్టాలు తీరాయి. ఇప్పుడు వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో పాఠాలు చక్కగా వింటున్నారు.
ఇంకా...
* నెడ్‌క్యాప్ సహకారంతో పొగరాని పొయ్యిని సమకూర్చుకుని మధ్యాహ్నం వంట చక్కగా చేస్తున్నారు.
* పాఠశాలకు ఏ అవసరం వచ్చిన నేనున్నానంటూ తెరస నాయకులు నారాయణరెడ్డి ముందుండి సాయం అందిస్తున్నారు. పదిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 15 ఆగస్టు వేడుకల్లో నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నారు.
* మరోదాత శేఖర్‌రెడ్డి కూడా పిల్లలకు అవసరమైన పుస్తకాలు ఇతర సౌకర్యాలు కల్పించారు.
* కంప్యూటర్ గది, మరో రెండు తరగతి గదులు సిబ్బంది, వంటగది అవసరం వీటిని త్వరలోనే సమకూర్చుకుంటామని గోవర్దన్ అంటున్నారు.
No comments:
Post a Comment