Wednesday, February 18, 2026

GSF SAC SELECTIONS - 2026

🌟 ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత — GSF SAC SELECTIONS 2026 ఘనంగా పూర్తి! 🌟

ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు సరైన సమయంలో చేయూత అందించాలనే సదాశయంతో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ (GSF) ఆధ్వర్యంలో నిర్వహించిన SAC (Sports, Academics & Cultural) Selection – 2026 కార్యక్రమం బుధవారం (ఫిబ్రవరి 18, 2026) నాడు సాధన కుటీర్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి శిక్షణ ద్వారా ఉన్నత అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
👥 పాల్గొన్న విద్యార్థులు
✅ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 51 ప్రభుత్వ పాఠశాలల నుండి
✅ సుమారు 415 మంది 7వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
🏅 ఎంపిక జరిగిన విభాగాలు
▪ కబడ్డీ
▪ వాలీబాల్
▪ ఖో ఖో
▪ యోగ
ప్రతి పాఠశాల నుండి 2–3 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతి విభాగంలో 50 మందిని ఎంపిక చేసి వారికి నిరంతర శిక్షణ శిబిరాలు నిర్వహించబడనున్నాయి.

🎯 కార్యక్రమ లక్ష్యం
క్రీడలు, విద్య మరియు సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను గుర్తించి, ఉచిత రెసిడెన్షియల్ శిబిరాల ద్వారా శిక్షణ అందించి వారి ప్రతిభను సమాజానికి పరిచయం చేయడం.
🎖 గౌరవ అతిథులు
✨ శ్రీ జి. రాఘవ రెడ్డి — PETA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (విద్యార్థులను ఆశీర్వదించారు)
✨ శ్రీ భాస్కర్ రెడ్డి — PETA రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు (క్రమశిక్షణే విజయం సాధించే మార్గమని పేర్కొన్నారు)
🤝 కార్యక్రమంలో పాల్గొన్నవారు
GSF Founder & Managing Trustee శ్రీ సదా వెంకట్, మాజీ MEO శ్రీ బి. శ్రీనివాస్ గౌడ్,
GSF Sports Wing Head Coach శ్రీ బి. చంద్ర, PET Association ట్రెజరర్ శ్రీ వెంకటేష్, ఇతర PETలు మరియు GSF వాలంటీర్లు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు.
జిల్లా విద్యాశాఖ తరఫున PET Associations మరియు పాఠశాలల PETలు గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న GSF బృందాన్ని అభినందించారు. 💐
— :GSF SK

Monday, February 16, 2026

Govt Degree CLG IBP visit

Visit of NSS Team from Govt. Degree College, Ibrahimpatnam to Sadhana Kuteer.
The NSS team from Govt. Degree College, Ibp visited Sadhana Kuteer and gained valuable insights into the ongoing training camps conducted through GSF–SAC (Sports, Academics & Cultural).
The team also learned in detail about the plant cultivation initiative being carried out with the noble objective of “Let’s Nurture and Protect Plants.” They appreciated the service activities of GSF and *expressed their willingness to extend continuous support by preparing a Memorandum of Understanding (MoU) through their college NSS unit for future collaboration.*

👨‍🏫 *Faculty
Members*
• Dr. S. Ramesh – Associate Professor of Economics & NSS Officer

• J. Narender Reddy – Lecturer in Zoology

• G. Ravi Kumar – Assistant Professor of Public Administration

• Dr. A. Rachana – Associate Professor of Botany

• Dr. P. Surekha – Associate Professor of Chemistry
Faculty members along with the NSS student team actively participated in the visit and discussed future service initiatives.

🤝 A meaningful step towards collaboration, environmental responsibility, and continuous service.
:~ GSF SK.

Monday, February 9, 2026

Achievement @ Selections

Good News to All GSF Team Members, Supporters & Well-Wishers!
We are proud to announce that students from the *GSF 1st Batch Volleyball Program have been selected to represent the Hyderabad Team and participated in the Sub-Junior Inter-District Volleyball Championship 2025–26, organized by the Telangana Volleyball Association.*

📍 Venue:
 Nizamabad District

📅 Dates: 05th February 2026 to 08th February 2026

Selected Players👇:

1) Yashwant – ZPHS, Aziz Nagar

2) Shiva – ZPHS, Aziz Nagar

3) Thanish – ZPHS, Shivarampalli
*This achievement is a proud moment for the GSF family and reflects the hard work, discipline, and continuous guidance provided to our students.*

*Special congratulations to our sports coaches as well, whose dedicated training and constant guidance made this achievement possible*.

*We congratulate the players and wish them continued success in their sporting journey.*
 🏐.
:~ GSF SK

Monday, February 2, 2026

పద్యాల తో రణం సన్నాహక సమావేశం

01-02-2026 ఆదివారం  జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ మరియు అనంత సాహితీ సంస్థ రికగ్నైజేడు ఉపాధ్యాయ పండిత పరిషత్తు ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన పద్యాల తోరణం సన్నాహక సమావేశంలో చర్చించబడి ఒక నిర్ణయానికి వచ్చిన అంశాలు...
# ప్రతి మండలానికి ఇద్దరు భాషా ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలి 

#వారి ద్వారా పాఠశాల స్థాయిలో 6 నుంచి 10 తరగతుల వరకు  ఏ తరగతి స్థాయికి ఆ తరగతి విద్యార్థులతో పోటీ నిర్వహించాలి 
#తరగతికి ఇద్దరు చొప్పున పాఠశాల నుంచి 10 మందిని ఎంపిక చేయాలి.

# పాఠశాలలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులతో  మండల స్థాయి పోటీ నిర్వహించాలి.

 #ప్రతి మండలం నుంచి గెలుపొందిన పదిమంది  విద్యార్థులను జిల్లాస్థాయికి పంపించాల్సి ఉంటుంది.

 #జిల్లా స్థాయిలో రెండు రోజులకు తగ్గకుండా భాషా వేడుక నిర్వహించబడుతుంది ఇందులో ఉత్సాహంగా పాల్గొనే ఉపాధ్యాయులకు చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతిగా పారితోషికాలు కూడా అందించబడతాయి. 

#సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవానికి ముందుగానే పాఠశాల స్థాయి మండల స్థాయి లలో పోటీలు ముగించుకొని భాషా దినోత్సవానికి రెండు మూడు రోజులు అటు ఇటుగా జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించడానికి నిశ్చయించడమైనది 

# పద్య ప్రియులకు అంత్యాక్షరి పోటీ పద్యాలతోనే ఉంటుంది. ఉత్సాహం కలిగిన వాళ్లు ఇందులో పాల్గొనవచ్చు

#మళ్లీ భాషాభిమానులం అందరం ఒక 15 రోజులలో గూగుల్ మీట్ వేదికగా సమావేశమై ఈ నిర్ణయాలను పునః సమీక్షించి తుది తీర్మానం చేయవలసి ఉంటుంది.