త్యాగమూర్తులను స్మరించుకుందాం- భావితరాలకు స్ఫూర్తినందిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ శిక్షణా శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులతో జనవరి 28, 2021 భారతమాత ఆవిష్కరణ జరిగింది..
జనవరి 29న రెoడవ వార్షికోత్సవo నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 300మంది పాఠశాల విద్యార్థులతో భరతమాత పూజా మరియు 99వ వారం హారతి జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ మాట్లాడుతూ..
దేశం కోసo అన్నీ త్యాగం చేసిన మహనీయులను మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి, వారి ఆశయాల కోసo మనం పనిచేయాలి. అది విద్యార్థి వయసులో సంకల్పం తీసుకోవాలి అన్నారు..
ఈ కార్యక్రమంలో SSC Examination Retired అధికారి శ్రీ కుమార స్వామిగారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, మాజీ కబడ్డీ చాంపియన్ శ్రీ దేవిక బట్నాకర్ గారు పాల్గొన్నారు.
కార్యక్రమoలో పాల్గొన్న 300మంది విద్యార్థులచే సదా వెంకట్ గారు మనం ఉన్నంతంగా ఎదగడానికి ప్రపంచం కావలి, మనం ఎదిగాక ప్రపoచానికి మనం కావాలి, అందుకే ప్రపంచం మనకోసం ఎదురుచూసేలా మనం ఎదగాలి అని విద్యార్థులచే సంకల్పం చేయించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు Exam Pads, pens అందిoచారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, శ్రీమతి ప్రమోద, రఘు, శ్రీశైలం, సంపత్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment