Wednesday, December 28, 2022

GSF_SAC Sports _Volleyball Selection

*
ప్రతిభను గుర్తిద్దాం -ప్రతిభవoతులకు చేయూతనిద్దాం* అనే ఆశయ స్పూర్తితో..

కేవలం ఆర్ధిక బీదరికం కారణంగా విద్యార్థులు తమ ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో 
పల్లెల్లోని ఆర్ధిక నిరుపేద ప్రతిభావoతులను వారికి అభిరుచి ఉన్న అంశంలో గుర్తిoచి ప్రోత్సహించాలనే సదాశయంతో *జ్ఞానసరస్వతి ఫౌండేషన్ SAC-(Sports, Academics, Cultural) కార్యక్రమం యోజన చేసింది.
అందులో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి, ఆయా అంశాలలో  నిష్ణాతులచే శిక్షణ ఇవ్వాలని GSF సంకల్పిoచిoది.

SAC- Sportsలో భాగంగా క్రీడాకారుల ఎంపిక:
మొదటి విడతగా రంగారెడ్డి జిల్లాస్థాయిలో వాలీబాల్, కబడ్డి ఆటలలో క్రీడాకారులను గుర్తిస్తున్నది.
Event3  ఇబ్రహీంపట్నం జోన్ లోని హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల & యాచారం మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులకు టోర్నమెంట్ cum సెలక్షన్ డిసెంబర్ 28 & 29 తేదీలలో, వినోబా నగర్ లోని సాధన కుటీర్ లో నిర్వహిస్తున్నది.
28వ తేది జరిగిన ప్రారంబోత్సవ కార్యక్రమంలో 
గౌరవ అతిథులుగా తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి గారు,
రంగారెడ్డి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘo అధ్యక్షులు శ్రీ బాస్కర్ రెడ్డి గారు, సంఘం కోశాధికారి శ్రీ వెంకటేష్ గారు పాల్గొన్నారు.
ప్రారంభ ఉత్సవానికి 16పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. రేపటితో IBP Zone ఎంపిక పూర్తవుతుoది..
రoగారెడ్డి జిల్లాను 3జోన్ లు విభజించి ఎంపిక చేసిన విద్యార్థులో 
వాలీబాల్ నుండి 75 మరియు కబడ్డి నుండి 75 మంది విద్యార్థులను శిబిరాల కోసం ఎంపిక చేస్తారు.
ఈ ఎంపిక కార్యక్రమానికి  శంకర్, వెంకటేష్, జిలాని, కుమార్ PET ల బృందo నిర్వహణ బాధ్యత వహిస్తున్నది.

No comments:

Post a Comment