GSF_RURAL GENIUS-2023
ప్రముఖ విద్యావేత్త, మాజీ MLC శ్రీ చుక్కా రామయ్య ద్వారా పోస్టర్ ఆవిష్కరణ.
••పల్లెల్లోని ఆర్ధిక నిరుపేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహంచే కార్యక్రమం.
**SAC (Sports, Academics & Cultural) ద్వారా 12అంశాలలో, 6నుండి 9వ తరగతుల నుండి 900మంది విద్యార్థులను ఎంపిక చేసి, సాధన శిబిరాలలో నిష్ణాతులచే శిక్షణ అందిస్తారు.
**ఎంపికైన విద్యార్థులకు వివిధ స్థలాలలో, అనుకూల సమయంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు.
**ఆర్ధిక నిరుపేదల ప్రతిభ సమాజపు ఆస్తి, సరైన సమయంలో చేయూతనిచ్చి, వారి ప్రతిభను సమాజానికి చాటడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమ నిర్వహణ.
"ప్రతిభను గుర్తిద్ధాం_ ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూతనిద్దాం "అనే సదాశయంతో పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నిగూఢ ప్రతిభను గుర్తించి వారిని పల్లె ఆణిముత్యాలుగా సమాజానికి అందిoచాలని
GSF_SAC అనే కార్యక్రమాన్ని రూపొందిoచిoది.
SAC_Sports, Academics & Cultural అనే మూడు ముఖ్య విభాగాలలో 12అంశాలను గుర్తించి, ఆయా అంశాలలో విద్యార్థికి అభిరుచి ఉండి ప్రతిభ కనబరచిన ఆర్ధిక బీద విద్యార్థులను గుర్తించి నిష్ణాతులైన శిక్షకులచే శిబిరాల ద్వారా శిక్షణ అందిస్తున్నది.
2015 ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జరగలేదు.
*2023 సoవత్సర శిబిరాల కోసం జిల్లా స్థాయిలో ఈ డిసెంబర్/జనవరి మాసాలలో విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
ఎంపిక జరిగిన విద్యార్థును పల్లె ఆణిముత్యాలుగా గుర్తించి వివిధ స్థలాల్లో, అనుకూల సమయంలో శిబిరాలు నిర్వహించి నిష్ణాతులచే శిక్షణ అందిస్తారు.
Rural GENIUS-2023 పోస్టర్ ప్రముఖ విద్యావేత్త, మాజీ MLC శ్రీ చుక్కా రామయ్య గారిచే ఆవిష్కరణ చేసి, వారి ఆశీస్సులు తీసుకున్న GSF సభ్యులు.
పల్లె బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల నిగూడ ప్రతిభను అన్ని అంశాలలో గుర్తించి ప్రోత్సాహించి సమాజానికి అందిoచే GSF ప్రభుత్వం అభినందనీయo. 2014 సంవత్సరం నుండి నేను ప్రత్యక్షంగా వీరి కార్యక్రమాలలో పాల్గొన్నాను.. అవసరమైన మేరకు సమాజం ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని చుక్కా రామయ్య గారు అన్నారు.
GSF వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ..
2008 సంవత్సరం నుండి ప్రభుత్వ బడుల విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం GSF పనిచేస్తున్నది. కేవలం ఆర్ధిక బీదరికం కారణంగా ఏ విద్యార్థి తన ప్రతిభను కోల్పోరాదు, అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే సదాశయంతో GSF కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ SAC కార్యక్రమాల ద్వారా విద్యార్ధికి అభిరుచి ఉండి ప్రతిభ ఉన్న అంశంలోనే ప్రోత్సహస్తూ శిక్షణ అందిస్తామన్నారు.
Singing, painting, Yoga, Speech, కబడ్డీ వాలీబాల్, STEM అంశాలలో విద్యార్థులను గుర్తిస్తారు. SAC అన్ని విభాగాలు కలిపి సుమారు 900మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తారు.
పోస్టర్ ఆవిష్కరణలో GSF వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు, GSF సభ్యులు శ్రీనివాస్ గౌడ్_Retd teacher, శ్రీ నరేష్, శ్రీమతి ప్రమోద, శ్రీశైలం మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ప్రతిభను గుర్తిద్దాం- ప్రతిభావంతులకు చెయూత నందిద్దాం
ReplyDelete