జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
సాధన శిబిరo -2025.
(ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం)
Apr 26 నుండి May 20వరకు.
Day 3/25
*సాధన శిబిర విద్యార్థులను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ*...
ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు,
GSF సాధన కుటీర్ లో నిర్వహించబడుతున్న 25రోజుల సాధన శిబిరాన్ని సందర్శించి,
సాధన కుటీర్ లో నూతనoగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ మండపం పూజ నిర్వహించారు.
అనంతరం విద్యార్థుల ద్వారా శిబిరంలో జరిగే విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆశీ: ప్రసంగం చేస్తూ.. విద్యార్థులు ఈ వయసులోనే తమకు ఇష్టమైన అంశంలో శ్రద్ధ వహించి, సాధన చేస్తే ఉన్నతంగా రాణిస్తారు. చదువుతో పాటు ఆటలు, సంస్కారం చాలా అవసరం అని తెలిపారు..
ఎన్ని ప్రతిభ ఉన్న దానికి సంస్కారం తోడు లేకపోతే ఉపయోగం ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి శిబిరాలలో చదువుతో పాటు సంస్కారం అందించే ప్రయత్నం GSF నుండి జరుగుతుందని తెలిపారు.
అనంతరం అన్నపూర్ణ మండపం ఏర్పాటుకు సహకరించిన శ్రీ సత్యనారాయణ గారిని సత్కరించారు.
సత్యనారాయణ గారు మాట్లాడుతూ GSF ద్వారా పల్లె బడుల విద్యార్థుల వికాసం కోసం ఒక మహా యజ్ఞంలా సాగుతున్న పనిలో నాకు అవకాశం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు.
GSF ద్వారా జరిగే కార్యక్రమాలకు ప్రారంభం నుండి స్వామీజీ ఆశీస్సులు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని GSF సదా వెంకట్ గారు తెలిపారు.
అదేవిధంగా సాధన కుటీర్ లో అన్నపూర్ణ మండపం ఏర్పాటు సహకారం అందించిన శ్రీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
:~ GSF