Tuesday, April 29, 2025

పల్లె ఆణిముత్యాలకు విద్యారణ్య స్వామీజీ ఆశీస్సులు

జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
సాధన శిబిరo -2025.
(ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం)
Apr 26 నుండి May 20వరకు.
Day 3/25
*సాధన శిబిర విద్యార్థులను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ*...
ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు,
GSF సాధన కుటీర్ లో నిర్వహించబడుతున్న 25రోజుల సాధన శిబిరాన్ని సందర్శించి, 
సాధన కుటీర్ లో నూతనoగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ మండపం పూజ నిర్వహించారు. 
అనంతరం విద్యార్థుల ద్వారా శిబిరంలో జరిగే విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆశీ: ప్రసంగం చేస్తూ.. విద్యార్థులు ఈ వయసులోనే తమకు ఇష్టమైన అంశంలో శ్రద్ధ వహించి, సాధన చేస్తే ఉన్నతంగా రాణిస్తారు. చదువుతో పాటు ఆటలు, సంస్కారం చాలా అవసరం అని తెలిపారు..
ఎన్ని ప్రతిభ ఉన్న దానికి సంస్కారం తోడు లేకపోతే ఉపయోగం ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా  ఇలాంటి శిబిరాలలో చదువుతో పాటు సంస్కారం అందించే ప్రయత్నం GSF నుండి జరుగుతుందని తెలిపారు. 
అనంతరం అన్నపూర్ణ మండపం ఏర్పాటుకు సహకరించిన శ్రీ సత్యనారాయణ గారిని సత్కరించారు. 
సత్యనారాయణ గారు మాట్లాడుతూ GSF ద్వారా పల్లె బడుల విద్యార్థుల  వికాసం కోసం ఒక మహా యజ్ఞంలా సాగుతున్న పనిలో నాకు అవకాశం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు. 
GSF ద్వారా జరిగే కార్యక్రమాలకు ప్రారంభం నుండి స్వామీజీ ఆశీస్సులు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని GSF సదా వెంకట్ గారు తెలిపారు.
అదేవిధంగా సాధన కుటీర్ లో అన్నపూర్ణ మండపం ఏర్పాటు సహకారం అందించిన శ్రీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
:~ GSF

Wednesday, April 16, 2025

సహృదయ సహకారం

అనుగ్రహిస్తున్న దైవానికి, కనుకరిస్తున్న ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏.. సహకరిస్తున్న సహృదయులకు హృదయ పూర్వక ధన్యవాదాలు..
పల్లె ఆణిముత్యాల ఆతిథ్యానికి సిద్ధమైన అన్నపూర్ణ మండపం..
పల్లెల్లోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల నిగూడ ప్రతిభను సరైన సమయంలో గుర్తించి, చేయూత అందించాలనే సదాశయ  సంకల్పoతో ఏర్పాటైoదే  *పల్లె ఆణిముత్యాల ప్రగతి సౌధం సాధన కుటీర్*. 
2008 సంవత్సరంలో ప్రారంభమై తన శక్తి మేరకు ప్రభుత్వ బడుల వికాసం కోసం పనిలో కొనసాగుతున్న జ్ఞానసరస్వతి పౌండేషన్ కోసం పకృతి ప్రసాదంగా Vinobha Devolopment Society (VDS) ద్వారా 2013 సంవత్సరంలో అందినదే వినోబానగర్ లోని స్థలం అదే ఇప్పుడు  సాధన కుటీర్.
అనేక మంది సహృదయుల సహకారంతో కొద్ది కొద్దిగా అభివృద్ధి చేసుకుని ప్రభుత్వ బడుల వికాసం కోసం పనిలో ఉన్నది.. 2020 లో వచ్చిన కరోనా కల్లోల సమయంలో పూర్తి సమయాన్ని ఉపయోగించుకుని అత్యంత అద్భుతంగా సుందరీకరించిని, నిత్య ప్రేరణా శక్తిగా భారత మాత విగ్రాహావిష్కరణ చేసుకుని, ఆణిముత్యాల  కార్యక్రమాల కోసం సిద్ధమమైoది..
అనుకోని సంఘటనగా  కొందరు ఈర్యపరుల అక్రమ దాడి కారణంగా సాధన కుటీర్ లో పురాతన కట్టడాలతో పాటు, Bothrooms, అన్నపూర్ణ మండపం కూడా అక్రమంగా కూల్చబడ్డాయి.
  నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికి ప్రకృతి తలవంచి సహరిస్తుందనేది GSF నిత్య చైతన్య నినాదం.. అదే ప్రకృతి నియమం కూడా. 
GSF అక్షరాల ఆ నినాదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంది..  ఇక్కడ శిబిరాలలో పాల్గొనే విద్యార్థులచే అదే నిత్యం ఉచ్చరింపజేస్తుంది..
అది నినాదమే కాదు,  ప్రకృతి అద్వితీయ ప్రసాదమని అనేక సందర్భాలలో నిరూపితమవుతున్నది..
అక్రమంగా కూల్చబడ్డ కుటీర్ 
గౌరవ న్యాయస్థానం (లోకాయుక్త) ఆదేశంతో పూర్వస్థితికి చేరుకుంటుంది.  
పల్లె ఆణిముత్యాల వికాస కార్యక్రమాల కోసం అవసరమయ్యే సౌకర్యాలు ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్నది సాధన కుటీర్. 
అందులో భాగంగా పల్లె ఆణి ముత్యాలు *భోజన వసతి కోసం సిద్ధమవుతున్న అన్నపూర్ణ మండపం*.
సహాయం చేసేవాళ్ళు రెండు రకాలు...
అడిగితే చేసేవారు ఒకరు, అడక్కుండానే మన అవసరాన్ని గుర్తించి చేసేవారు..
అడక్కుండా ఆపదలో/అవసరంలో చేసే వారు అరుదుగా ఉంటారు..
అలాంటి సహకారం అద్భుతం అంతేకాకుండా అరుదుగా జరుగుతుంది.

#GSF కార్యక్రమాలకు ఏ మాత్రం పూర్వ పరిచయం లేని శ్రీ భీమ సత్యనారాయణ గారు(సరూర్ నగర్ వాస్తవ్యులు,వ్యాపారవేత్త) పరిచయస్తుల నుండి  #సాధనకుటీర్ ద్వారా  జరిగే కార్యాలను తెలుసుకుని, ఒక్కసారి మాత్రమే  కుటీర్  సందర్శించి, ఇక్కడ కార్యక్రమాలు, సంస్థ ఆశయాలను తెలుసుకుని స్పూర్తి పొంది అన్నపూర్ణ మండప నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించారు*.  
వారికి మరియు వారికి సహకరించిన కుటుంబ సభ్యులకు GSF తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం🙏. 
సమయానుకూలంగా వారికి GSF వేదిక ద్వారా పరిచయo చేసుకుందాం, అభినందించుకుందాం, సన్మానించుకుందాం.

ఆర్థిక నిరుపేద ప్రతిభావంతుల  నిగూడ ప్రతిభ సమాజపు ఆస్తి... వారికి సరైన సమయంలో చేయూత అందిద్దాం..సమాజానికి పరిచయం చేద్దాం.
:~ సదా వెంకట్, GSF.