భారత్ మాతా కీ జై..
*https://youtu.be/TZ9NMNb9vu0?si=KNhk3-NHtFtQDUNR*
*అధ్బుతంగా కనిపించే ప్రతీ కార్య సఫలతలో మెండైన శ్రద్ధ కనబడుతుంది*....
*శ్రద్ధతో చేసిన ప్రతీ కార్యo ద్వారా అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి*..
పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం కొనసాగుతున్న సాధన కుటీర్ లో ఒక పల్లె ఆణిముత్యం కుంచె నుండి అద్భుతాలు.
*సాధన కుటీర్ లో ఉన్న ప్రతీ చెట్టూ, ప్రతీ రాయిలో గత వైభవ సాధకులను సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పాటు ఇక్కడ శిబిరాలలో పాల్గొనే విద్యార్థులకు నిత్య ప్రేరణా శక్తులుగా నిలచే విధంగా పెయింటింగ్స్ చేయాలనే సదాశయ సంకల్పం జరిగింది*..
2021లో ప్రారంభమై కొన్ని చిత్రాలు వేయబడ్డాయి..
ఆ బండ రాళ్ళలో, చెట్లలో ఆ చిత్రాలకు ప్రాణం పోసింది కూడా ఒక పల్లే ఆణి ముత్యమే..
*చిత్రలేఖనం మీద ఉన్న ఆసక్తితో 2015లో తన 8వ తరగతిలో GSF సాధన శిబిరంలో పాల్గొని, నిరంతర సాధనలో ఉంటూ BFA పూర్తి చేసి MFA కోసం సిద్ధమవుతున్న సాయి కుమార్*..
*జనవరి 2021లో భారత మాత విగ్రహావిష్కరణ సందర్భంగా తాను వేసిన చిత్రాలకు 2025 మళ్ళీ రంగులు అద్దీ, సిద్ధం చేసిన వైనం అధ్బుతం*.. సాధన కుటీర్ లో 2018 సాధన శిబిరం నందు చిత్రలేఖనంలో తన ద్వారా శిక్షణ పొంది, ప్రస్తుతం BFA చేస్తున్న విశ్వ సాయి ఈ కార్యంలో తోడుండడం మరో అద్భుతం. సాధన శిబిరాల పూర్వ విద్యార్ధులిద్దరూ ఈ కార్యంలో పాల్గొనడం మహా అధ్బుతం.
ఈ పని కోసం ఎంతో మంది కళాకారులు అందుబాటులో ఉన్నా కూడా
.. అవి వేసిన
సాయి ద్వారానే ఆ చిత్రాలకు మెరుగులు దిద్దాలనే నిర్ణయంతో...
సాధన శిబిరాలలో పాల్గొనే పల్లె ఆణిముత్యాల నిత్య ప్రేరణా శక్తులుగా ఉండే
*భారత మాత* విగ్రహం మరియు *స్వామి వివేకానంద*, *Dr. అబ్దుల్ కలాం* గార్ల విగ్రహాలను అధ్బుతంగా తీర్చి దిద్దిన సాయి కుమార్ & విశ్వ సాయిలకు మనందరి తరపున శుభాభినందనలు...
తాము అనుకున్న కళా రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆశీర్వదిద్దాం.
:~ సదా వెంకట్, GSF.