Monday, December 2, 2024

అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక

మన సాధన కుటీర్ ఆతిథ్యానికి ప్రశంసల జోరు...
తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణలోని సాహిత్య అభిమానుల శ్రద్ధను హస్తిన వేదికగా అజరామరం నాటకం ద్వారా ప్రపంచానికి చాటలనే సదృఢ సంకల్పంతో అనంత సాహిత్య, సాంస్కృతిక వేదిక కృషి అధ్బుతం.
హస్తినలో(ఢిల్లీ)ప్రదర్శన చేసే నాటక అభ్యాసం కోసం రెండు రోజుల ఆతిథ్యం ఇచ్చే అవకాశం మన సాధన కుటీర్ కు దొరకడం  అదృష్టం...
నేటి రోజులలో సంపద కన్నా అత్యంత విలువైన సమయాన్ని తెలుగు భాష కోసం వెచ్చిస్తూ, అజరామరo నాటకంలోని పాత్ర దారులంతా గొప్ప విద్యావంతులే, వారిలో ఎక్కువ మంది ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే. అయినా సాహిత్య అభిమానులై, కళా పిపాసులై అంతకు మించి సమాజ హితకారులై ఈ నాటకంలో  పాత్ర దారులైనారు.  వారి శ్రద్దకు ప్రణామాలు🙏. 
అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ద్వారా ప్రదర్శన జరిగే అజరామరo నాటిక మంచి ఆదరణ పొంది, గొప్ప పేరు పొంది మన తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.
ఈ వేదిక ద్వారా జరిగే ప్రయత్నంలో మన సాధన కుటీర్ కు కూడా కొంత అవకాశం కల్పించిన సమితి రూప శిల్పి శ్రీ దోరవేటి గారికి మరియు వారి బృందానికి మనందరి తరపున ప్రత్యెక ధన్యవాదాలు.
:~ సదా వెంకట్.