*విద్యా దాత పురస్కారం*
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల వికాసం కోసం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న జ్ఞానసరస్వతి పౌండేషన్ ను 10/06/24 న రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ *విద్యా దాత పురస్కారం- 2024"* తో సత్కరించారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ మహిళా విభాగం SAADRI ఇంచార్జీ శ్రీమతి ప్రమోద గారు సంస్థ తరపున పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివి పదవ తరగతిలో 10/10 GPA సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆయా బడుల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన గారు, శ్రీ బుర్ర వెంకటేశం IAS, శ్రీ సజ్జనార్ IAS లు కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం పనిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మాజీ IAS అధికారి శ్రీ జయప్రకాష్ నారాయణ గారు మరియు ఇతర పెద్దల ద్వారా ఈ పురస్కార ప్రధాన మహోత్సవం జరిగింది.
GSF టెక్నికల్ టీం మెంబర్ సంపత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.