Tuesday, June 27, 2023
Monday, June 26, 2023
వక్త @ PUBLIC SPEAKING
*వక్త* శిక్షణ ప్రారంభం
26.06.2023..
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ & SP SPOKEN ENGLISH ACADEMY సంయుక్త ఆధ్వర్యంలో సాధన కుటిర్ లో నిర్వహిస్తున్న *వక్త* 9రోజుల ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, గొప్ప వక్త దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ మాధవనేని రఘునందన్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు*.
శిక్షణ కార్యక్రమానికి హాజరైన శిక్షార్ధులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ *ఒక వ్యక్తిగా మనం ఏ రంగంలో ఉన్నా సరే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని లక్ష సాధన కోసం ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే నిరంతర కృషితో, కఠినమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి తప్ప వెన్నుచూపకూడదని అన్నారు*.
*ఒక వక్తగా ఎదగాలంటే నిరంతరం పుస్తకాలను అధ్యయనం చేయాలని, సామాజిక పరిజ్ఞానం పెంచుకోవాలని సమయస్ఫూర్తిని కలిగి ఉండాలని ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని వారు పేర్కొనడం జరిగింది.* జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి నుండి గుణపాటాలు నేర్చుకుంటూ ముందుకే వెళుతూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి తప్ప అహంకారం అనేది వ్యక్తి యొక్క పతనానికి నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా మన వ్యక్తిత్వాన్ని కూడా వృద్ధి చేసుకోవాలని, సమాజంలో చైతన్యాన్ని రగిలిస్తూ మనం చెప్పే విషయాలనే వ్యక్తిగత జీవనంలో ఆచరించాలని వారు మార్గదర్శనం చేయడం జరిగింది.
జ్ఞానసరస్వతి పౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ నిష్ణాతులైన శిక్షకులచే, పూర్తి శ్రద్ధతో ఉచితంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, ఇతర విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కావున అందరూ ఉపయోగించుకోవాలి అన్నారు. సమావేశ అనంతరం సాధన కుటీర్ లోని భారత మాత విగ్రహానికి హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పబ్లిక్ స్పీకర్ ఆనంద్ గారు, ఎస్పీ ఇంగ్లీష్ అకాడమీ వ్యవస్థాపకులు పోలే సంజయ్ గారు మరియు GSF కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.
:~ team వక్త @ సాధన kuteer.
Thursday, June 15, 2023
వక్త @ PUBLIC SPEEKING
జ్ఞానసరస్వతి పౌండేషన్ & S.P. Spoken English Academy సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన *వక్త* _ Public Speeking కోసం శిక్షణ కార్యక్రమం *సాధన కుటీర్* లో ప్రారంభమైoది.
*వివిధ సంస్ధల నుండి పాల్గొన్న కొద్దిమంది యువతకు, మంచి వక్త కావడంకోసం వివిధ అంశాలలో శిక్షణ కొనసాగుతున్నది.*
శిక్షణలో భాగంగా 9వ రోజు @ జూన్ 15వ తేదీ ఈ శిక్షణ కార్యక్రమానికి *ప్రముఖ కవి, కార్టునిష్టు మరియు *జాగృతి వారపత్రిక పూర్వ సంపాదకులు, శ్రీ అయ్యగారి ప్రభాకర్ రెడ్డి* గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షార్ధులకు *వక్తకు కావలసిన అనేక విషయాలలో మార్గదర్శనం చేశారు*.
:~ team PSC @ SK.
Subscribe to:
Posts (Atom)