Wednesday, May 22, 2019

GNANA PUSHKARAKU

GSF సభ్యులందరికీ  నమస్తే...

గ్రామీణ విద్యార్థుల వికాసంకోసం సంకల్పం చేసి, జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ద్వారా  పని ప్రారంభించి పుస్కర కాలం(12 సంవత్సరాలు) అవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

మన ద్వారా ఎంతమంది విద్యార్థులకు ఉపయోగం జరిగిందనేది మనము ఏనాడు లెక్కలు వేసుకోలేదు.. వేసుకోవాలనీ లేదు.
పని చేయడంలోనే మనం నిమగ్నం అవుదాం. ప్రతిభావంతులైన ఆర్థిక బీద విద్యార్థుల ప్రతిభను సమాజానికి అందించాలనే తాపత్రయంతో నిరంతర విద్యాయజ్ఞంలో మనం ఉందాం.

పుస్కర కాలంగా గ్రామీణ విద్యార్థుల వికాసంకోసం నిమగ్నమై చేసిన పనుల వలన మనకు  కొంత అవగాహన శక్తి పెరిగినమాట వాస్తవం. ఆ శక్తికి నిదర్శనమే మన *సాధన కుటీర్*.
క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ,
గ్రామీణ ప్రతిభావంతులకోసం నిర్మాణాత్మకంగా జరిగే కార్యక్రమాల నిర్వహణకు ఒక విశిష్ట స్థలం మన కుటీర్ కావాలి. *ప్రతిభావంతులైన ఆర్థిక నిరుపేదలకు ఒక భరోసా కేంద్రంగా కుటీర్ నిలవాలని ఆశిద్దాం*.  ఈ క్రమంలో మన  పనిని, పనిలో గుణాత్మకతను ఇంకా పెంచుకోవాలి.

పుస్కరకాలంగా మన కార్యక్రమాలకు నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు నిండు హ్రదయంతో ధన్యవాదాలు తెలుపుదాం. అలాంటి వారికి  ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.. *వెలకట్టలేని సమయ సమర్పణతో, నిండు మనస్సుతో కొంతమంది మన కార్యక్రమాలను నిర్వహించారు*. పరుస్థితులు, సమయాభావం వల్ల అందరు అన్ని సమయాలల్లో అంతే ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కాని వారి హృదయంలో మన GSF కు ప్రత్యేక స్థానమనే చెప్పొచ్చు.
అదేవిధంగా ఇన్ని సం.రాల నుండి జరుగుతున్న మన కార్యక్రమాలకు అండగా ఉంటూ సహయసహకారాలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం.
ఇక ముందు కూడా అంతే ఉత్సాహంగా మన పనులో ముందుకెలదాం.

*జ్ఞానపుస్కరాలు*:: 
మన సంస్థ ప్రారంభమై 12 సం.రాలు అవుతున్న సందర్భంగా *జ్ఞానపుస్కరాలు* పేరున *2020' డెసెంబర్ నెలలో ఉత్సవాలు* నిర్వహించాలి అలోచిస్తున్నాం.
విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్సవాలు నిర్వహించాలనేది ఆలోచన.
కావున ఉత్సవాల నిర్వహణకోసం  మనందరం ఉత్సాహంగా తయారు కావాల్సి ఉంటుంది. మన పూర్వ కార్యకర్తలను, పూర్వ విద్యార్థులను( Lakshyam Camp, Sadhana Camp, Sankalp Divas, DGP  Etc.), శిబిరాలలో మన విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులను, మనకు సహాయ సహకారాలు అందించిన ప్రతివ్యక్తిని & సంస్థని, మన శ్రేయోభిలాషులను ఈ ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి.  అందుకోసం మనందరం కొంత తయారి కావాల్సి ఉటుంది. అందరం సహకరిద్దాం.

2019 ఆగష్టు నెలలో
*పుస్కరాల సన్నాహక సమావేశం తో పాటు సాధన కుటీర్ లో మొక్కలు నాటే కార్యక్రమం & మనందరికి ప్రీతి పాత్రమైన, మన నిత్యచైతన్య మూర్తి "భారతమాత" విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం ఉంటుంది*.
కావున మన దృష్టిలో ఉన్న మనవారందరినీ ఏకత్రీకరణ చేసే పనిలో మనమూ బాగస్తులమవుదాం. జ్ఞానపుస్కరాలకు సహకరిద్దాం.

      ఇట్లు
మీ శ్రేయోభిలాషి::
    సదా వెంకట్
Founder & Managing Trustee,
GNANA SARASWATHI FOUNDATION.